Others

సృ స్థి ల (సృష్టి స్థితి లయ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాడు
అరుగుల్లో పిడుగుల్ని స్పష్టపరుస్తూ
ఉషస్సును బద్దలుకొట్టే తూర్పు!!
ప్రభాత వాయువుల పసిడి చేతుల్లో
ఆకాశం ఒక జాతీయ పతాకమై
పల్లవిస్తుంది- కిరణాలు చరణాలుగా
పూలగుత్తులన్నీ కలసి కాల పూజకు ఉపక్రమించాయో-లేదో
చేతులెత్తి చెమట బిందువు గ్రీష్మానికి మొక్కింది
గగనంలో ఇంద్ర ధనుసు సప్తవర్ణ సౌష్ఠవంగా సాగిలబడింది
ఆకాశాన్నీదుతున్న తెల్లమబ్బులు
మంచు తెరలు తీసి
మహానగ్నలయ్యాయి
పలచబడ్డ దిక్కుల్లో పరిమళం ఒలుకుతుంది
‘‘పగలు ఎండ త్రాగి
రాత్రి నీడల్లో సూర్యుడి స్వాదుజ్ఞాపకాలను’’
చెమరునెమరు వేసుకుంటున్న
చెట్ల క్రింద
ఆకాశం వెలుబుచ్చిన నక్షత్రాలను
ఏరుకుంటూ
నేనున్నదిమీకోసమేగదా, రండి రాగ వక్త్రులై...
***
‘‘మధుర తంత్రుల విశ్వవిపంచి నేను
రాతి హృదయమ్ములోని నిర్ఘరము నేను
వసుమతీ గర్భతల సరస్వతిని నేను
నా గళమ్మెవియోగ సంయోగ మురళి’’
ప్రాణవాయువులూది పాడుతునే వుంటాను
గీతానికి రెక్కలు తొడిగి గగనంలోకి ఎగరేస్తూ వుంటాను
గాలి కొమ్మల గాంధర్వానికి
కదురురెక్కల పూల బరువు
నిదుర మత్తులో ఊగుతున్నప్పుడు
నిశ్శబ్దం
పరిమళ నిశ్వాసాల్లో మునిగి పరవశిస్తుంది...
నేను
పాడిన పాట పసివాడి నవ్వుముఖాన్ని
ముద్దులతో ముంతెత్తుతుంది. వాడి
మూసిన పిడికిళ్ళలోని స్వర్లా మొగసాలకు
రంగులద్దే మోజులు పడుతుంటే
యావత్తు మానవ జాతి తన కార్యరంగాన్ని
సిద్ధం చేసుకుంటుంది..
ఊహను పదార్థంగా మార్చి
పరిమాణం యిచ్చే పొగలో ఈ దేహం వేణువై
ఇంకా ఉంది

- సాంధ్య శ్రీ 8106897404