Others

శక్తి సంపన్నత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతమ్మను అనే్వషిస్తూ ఆంజనేయుడు సముద్రాన్ని లంఘనం చేసి లంకలో ప్రవేశించాడు. ఎంతో కష్టపడి చివరకు సీతమ్మ క్షేమ వార్తను కనుగొన్నాడు. ఆ తరువాత రావణునికి రాముడంటే ఏమిటో చెప్దామనుకొన్నాడు. రావణునికి హితోపదేశం చేస్తే చేసిన తప్పును సరిదిద్దుకొంటాడనుకొని రావణుని సభామంటపంలోకి వెళ్లాడు. అక్కడ రావణునికి ఎన్నో హితవచనాలు చెప్పాడు. కానీ రావణుని చెవికి మంచిమాటలు రుచించవు కదా. ఒకవేళ మంచి మాటలు చెవిన చేరినా అర్థం కావు కనుక రావణుడు ఆవేశపరుడై ఆంజనేయునికి బుద్ధి చెప్దామనుకొన్నాడు. అదిగో అపుడే రావణుని ఆజ్ఞపై రాక్షసులంతా చేరి ఆంజనేయుని తోకకు నిప్పు అంటించారు. ఈ సంగతి సీతమ్మకు తెలిసింది. పతివ్రతా శిరోమణి యైన సీతాదేవి హనుమంతునికి అగ్ని బాధ లేకుండుటకై అగ్నిదేవుని ప్రార్థించింది.అగ్ని జ్వాలలు శాంతించి మారుతికి ప్రదక్షణ పూర్వకంగా ప్రజ్వలించి మంచుగాలి వలె చల్లగా వీచెను.
శ్లో॥ యద్యస్తి పతి శుశ్రూషా యద్యస్తి చరితం తపః
యదిచాస్త్యేక పత్నిత్యం శీతోభవ హనుమతః
యదికించిదను ప్రోశః తస్యమవ్యాప్తి ధీమతః
యదివాభాగ్య శేషోమే శీతోభవ హనూమతః
యదిమాం వృత్త సంపన్నాం తత్సమాగమలాలిసామ్
సలిజానాత్ ధర్మాత్మా శీతోభవ హనూమతః
యదిమాం తారయే దార్యః సుగ్రీవ స్సత్య సంగరః
అస్మాదుఃఖాంబు సంరోధాత్ శీతోభవ హనూమతః - సుం. స.53
‘ఓ అగ్నిదేవా! నేను పతి సేవా పరాయణనైనచో తపస్సంపన్నురాలైన పతివ్రత నగుదునేని ఈ మారుతిని చల్లగా చూడుము.’
‘దేవా! నేను శ్రీరామ అనుగ్రహమునకు పాత్రోరాలనైనచోఇంకను నాకు భాగ్యశేషమున్నచో మారుతికి అగ్నిబాధకలుగునీయకుము. శ్రీరాముడు నన్ను గాచి శీలవతిగా తలచియున్నను, నా భర్త చెంత చేరుటకు నేను ఉబలాట పడుట యథార్థమగునేని రుూ వాయుపుత్రుని చల్లగా చూడుము. ఈ దుఃఖ సముద్రము నుండి నా భర్త రక్షించగలిగినచో మారుతిని చల్లగా చూడుము అని ప్రార్థిచినది. ఆప్రార్థన ఫలితమే అగ్ని హనుమంతునికి మంచు వలె అనిపించింది. పతివ్రతలు ప్రకృతిని శాసించగలుగుట యే కాక, సూర్యచంద్రాదుల గమనమును తపఃశ్శక్తిచే నిరోధించగలరు.
ఒకప్పుడు పదిసంవత్సరములు ఘోరక్షామము సంభవించి, తిండి, నీరు లభించక లోకములు దగ్ధమగు చుండెను. అప్పుడు మహాపతివ్రత అత్రి మహర్షి భార్య అనసూయా దేవి తపమొనర్చి కందమూలములను సృష్టించి గంగానదిని ప్రవహింపచేసి అందరినీ ఆకలిదప్పుల బాధనుంచి రక్షించెను.
ఘోర తపస్సు చేసి మునీశ్వరుల విఘ్నములను నివారించెను. ఒకప్పుడు మాండవ్యమహాముని ఆగ్రహించి అనసూయాదేవి ఆత్మీయురాలైన ‘శాండిలి’ అను తపశ్వినిని పది దినములలో వైధవ్య ప్రాప్తి గలుగు గాక అని శపించాడు. శాండిలియు ఆగ్రసించి ‘ఇక ఎన్నడూ సూర్యోదయము కాకుండు గాక ’ అని ప్రతి శాపం ఇచ్చెను.ఈ పరిస్థితులను అధిగమించలేని అశక్తులగు దేవతాగణములు దిక్కుతోచక అనసూయాదేవిని శరణు వేడిరి. ఆమె తన పాతివ్రత్య మహిమ చేత పదిరాత్రులును ఒక రాత్రిగా మార్పు చేసి ‘శాండిలి’ భర్తను రక్షించెను.
కొండలు, శిలలు వంటి కఠినత్వముతో కూడినవి కూడా అనసూయాదేవి పాదముల కింద పడినవెంటనే అవి మృదుత్వము వహించేవి. అంతేకాక సూర్యుడు, అగ్ని ప్రచంఢ మారుతముకూడా ఆమె పాతివ్రత్య మహిమవల్ల మలయానిలమైయ్యేది.
త్రిమూర్తులను పసిబాలురుగా మార్చుట లో కూడా అనసూయాదేవి పాతివ్రత్యమే కారణమైన సంగతి సర్వజన విదితమే. జనకమహారాజు సీతాకళ్యాణ సందర్భంగా కన్యాదానమొనర్చుచు పతివ్రతా మహాభాగా అని పల్కెను. సీతాదేవి కూడా పాతివ్రత్యమహిమ కలదని జనకుడు ముందుగానే తెల్పాడు.
మహాభారతంలో పతివ్రత గాంధారి శ్రీకృష్ణుని దూషించుచూ ‘కృష్ణా! దాయాదుల మధ్య వివాదముగలిగి, వారందరూ చచ్చేటట్లు చేశావు. నీవు నీదాయాదులు ఒకరినొకరు కొట్టుకొని చస్తారు యాదవ వంశము సర్వనాశనమై నేటికి 36 సంవత్సరముల తర్వాత నీవు దిక్కులేని చావు చస్తావు’అని దారుణంగా శపించినది.అందుకే కృష్ణుడు మరణం కృష్ణయ్య ఒంటరిగా ఉన్నపుడే జరిగింది.
కృతయుగంలో రావణుడు తపస్సు చేయుచున్న వేదవతిని బలాత్కరించబోగా ఆ పతివ్రత ‘రావణా! నేను అయోనిజనై మరల జన్మించి నిన్ను నాశనము చేస్తానని ఘోరంగా శపించింది. ఆమె సీతగా జన్మించి రావణ వధకు కారణమైనది. రుక్మీణీదేవి, సావిత్రి,సుమతి, ద్రౌపది, మండోదరి,లోపాముద్ర, మొదలైన వారంతా పతివ్రతాశిరోమణులుగా పేరుపొందిరి.
ఇంతటి మహిమాన్వితలైన స్ర్తిలున్న దేశం మనది. ఇప్పటి స్ర్తిలంతా కూడా అంతటి శకి తవంతులు అయ నేడు జరుగుతున్న అరాచ కాలను, అకృత్యాలను కాలరాయాలి. దీనికి నాటి పతివ్రతలు స్మరించుకుని వారి జీవిత చరిత్రలను తెలుసుకొని వారిబాటలోనే నడిచి దేశపౌరులను తీర్చిదిద్ది దేశాన్ని బాగు చేయగలరని ఆశిస్తున్నాను.

- ఆర్. రామారావు.. 9492191360