Others

బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాద్రపద అమావాస్యమొదలు బతుకమ్మ సంబరాలు ఆరంభం అవుతాయ. సర్వ జగతికి కారణ మైన జగన్మాత పూవుల్లోను, దీపాల్లోను, పసుపు కుంకుమల్లోను ఉన్నట్టు భావించి పూజించడం అనాదిగా వసున్నదే. ప్రకృతిలోని వృక్షాలను పూజించడమూ ప్రతివారికి అలవాటే. మనిషి తన ఉన్నతికి, తన సంతోషానికి కారణ మైన వస్తువునెనా, అవస్తువునైనా పూజించ డం అనేది తన నైజం. కనుకనే ప్రకృతి ఆరాధన కూడా మనకు సనాత నమే అయంది. వృక్షాలు అనేక విధాలుగా ఉపయో గపడుతాయ. కనుక వృక్షో రక్షతి రక్షతః అని ఈ శరన్నవరాత్రుల్లో మొట్ట మొదటి అమావాస్యరాత్రినే బతుకమ్మ అంటే పూలగోపురాలను పేర్చి పూజిస్తారు.
ప్రకృతినే పరమాత్మగా ప్రత్యక్షంగా కొలిచే పండుగే బతుకమ్మ. విశ్వమంతా వ్యాపించి ఉన్న శక్తి స్వరూపిణి వివిధాలుగా కనిపిస్తున్నందుకు ప్రతీకగా అనేక రంగులు, అనేక సువాసనలు ఇచ్చే పూలను ఆ శక్తిస్వరూపిణిగా, బతుకమ్మగా భావిం చి శక్తికి ప్రతిరూపాలైన మహిళలంతా ఆరాధిస్తారు. పురుషులంతా ఆ ఆరాధనకు ఆలంబనగా నిలుస్తారు. సర్వసృష్టి స్ర్తీపురుషులిద్దరి వల్ల కొన సాగుతుంది. ఇందులో ఎవరూ ఎక్కువ కాదు తక్కువాకాదు. కనుక ఒకరు పూలను, ఆకులను ఏరి తెస్తే మరొకరు ఆ పూలను బతుకమ్మ రూపం గా పేరుస్తారు. అందరూ కలసి ఆ అమ్మను పూజి స్తారు. ఈ బతుకమ్మ పూజ తెలంగాణా లో ప్రముఖంగా కనిపిస్తుంది. దీనికన్నా ముందు భాద్రపద చవితి మర్నాడు అంటే భాద్రపద పంచమి నుంచి పొలంలోని మట్టితోకాని, పుట్టమన్నుతో కాని బొడ్డెమ్మను తయారు చేసి బంతి చామంతులతో అలంకరించి బొడ్డెమ్మగా పిలుస్తూ పూజిస్తారు. ఈ బొడ్డెమ్మ పూజను కూడా తొమ్మిది నాళ్లు చేస్తారు. ఈ బొడ్డెమ్మను ప్రతి పనికి ఆరంభంగా విఘ్నేశుని పూజచేసినట్టుగా కొన్ని ప్రాంతాల్లో చేస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో కన్యలే ఈ బొడ్డెమ్మను పేర్చి పూజిస్తారు. ఆ బొడ్డెమ్మ చుట్టూ కన్యకలందరూ చేరి సాయంత్రం పూట బొడ్డెమ్మ ఆట ఆడుతూ అంటే మధ్యలో బొడ్డెమ్మ నుంచి కన్యలంతా చుట్టూత చేరి లయబద్ధంగా చప్పట్లు చరుస్తూ పాట పాడుతూ బొడ్డెమ్మ ఆట ఆడుతారు. అంటే మొట్టమొదట మట్టి పూజ అంటే అసలు ఈ భూమిపై నివసించడానికి ఆస్కారం కలిగించిన భూదేవి పూజ ఆ తరువాత ఆ భూమిలో బీజాలు విత్తి అంకురించి, మొలకెత్తి చిరు మొక్కలై, చెట్లై అవి పుష్పించి కాయలు పండ్లు ఇచ్చేట్టు మారే లోపు మరోతరాన్ని ఆహ్వానిస్తూ పూచిన పూత అంటే ఆ పూవులకే పూజ చేస్తారు. అదే బతుకమ్మ పూజ. ఇదీ ఆశ్వీజమాసం తొమ్మిదినాళ్లు సాగుతుంది.
ఈ బతుకమ్మను నేల తల్లి విరిసిన సుమాలను ఏరితీసుకొచ్చి అందంగా అమర్చి దానిపై పసుపుగౌరమ్మను తీర్చి కొలుస్తారు. సాధారణంగా వెదురుతో అల్లిన అల్లికపైనకానీ, ఇత్తడిరేకుపైన గానీ గుమ్మడి ఆకులను పరుస్తారు. థానిపై గునుగు, గుమ్మడి, తంగేడు, రుద్రాక్ష, బీర, గనే్నరు , బంతి, గోరింట , సొర ఇలాంటి పూవులన్నిటిని అందంగా ఒక వరుసపై మరొక వరుసను పేరుస్తారు. అలా పేర్చిన పైభాగంలో పసుపు గౌరమ్మను ఉంచి అలంకరణ పూర్తిఅయిన తర్వాత దీపం వెలిగించి అగరుధూపం అమ్మకు సమర్పించి వివిధ రకాల నైవేద్యాలను అమ్మకు సమర్పించి, తమ బతుకులను చల్లగా చూడమని కోరుకుంటూ నాలుగురోడ్ల కూడలిలోనూ, లేక మైదానం వంటి ప్రాంగణాలలోను ఆ వాడ పడుచులందరూ సామూహికంగా చేరి అందరు పేర్చిన పూలమ్మలను ఒకచోట గుంపుగా పెట్టి అందరూ వలయకారంలో నిలబడి చేతులు తడుతూ బతుకమ్మ పాటలు పాడుతారు.
ఈ పాటల్లో సామాన్యంగా సామాజిక బాధ్యత ను ఎత్తి చూపడం, సమాజంలో ఉన్న అరాచకా లను చూపడం వంటి ఇతివృత్తాలు ఉంటాయ. అంతేకాక అత్తాకోడళ్లు, వదినామరదళ్లు, మామఅల్లుళ్లు, బావామరదులు ఇలా వీళ్ల మధ్య ఉన్న సంబంధాలు, అనుబంధాలు, మనస్తత్వాలు, మమతల మధ్య దాగి ఉన్న సున్నితత్వాలు అన్నీ ఈ బతుకమ్మ పాటల్లో కనబడుతాయ. చివరగా బతుకమ్మకు నైవేద్యాలు సమర్పించిన ప్రసాదాన్ని, పసుపుకుంకుమలను నలుగురు పంచుకుంటూ బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు.
ఇలా సాగే బతుకమ్మ పండుగలోని పరమార్థంతో పాటు చాలా కథనాలు ప్రచారంలో ఉన్నాయి. లక్ష్మీ పార్వతుల సమ్మేళన రూపమే గౌరమ్మగా భావిస్తారు.

- డా. ఎ.రాజమల్లమ్మ