AADIVAVRAM - Others
కైతికాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 28 September 2019
పుడమితల్లి పుత్రుడు
ప్రకృతి ప్రేమికుడు
మట్టినే నమ్మినోడు
నిత్యకృషీవలుడు
వారెవ్వా హాలికులు
మట్టిలో మాణిక్యాలు..!
జ్ఞానజ్యోతి వెలిగించి
అజ్ఞానం తొలగించే
సుజ్ఞానం కలిగించి
ప్రజ్ఞానం అందించే
వారెవ్వా గురువులం
నీడనిచ్చు తరువులు..!
ఆణిముత్యాల సొగసు
ఆమని పూల వలపులా
కస్తూరి పరిమళంలా
మురళీ రవళుల గానంలా
సూర్యచంద్రులుండుదాక
నిలుచు ఉండు తెలుగు భాష..!