AADIVAVRAM - Others

మొగ్గలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవకవిని స్వేచ్ఛగా చిగురింపచేస్తేనే కదా
అతడు కవితావనమై నిండా విరబూస్తాడు
అతని కవిత్వం పరిమళించే మందారం

అక్షర మొగ్గలు చిగురించి పరిమళిస్తేనే కదా
కవితా సుగంధం అంతటా వ్యాపించేది
అక్షరం మొగ్గతొడిగితేనే కవిత్వం భాసించేది

అమ్మ చేతి వంట తింటేనే కదా
ఏదైనా అమృతమై ఆకలి తీరుస్తుంది
అమ్మ ఆకలి తీర్చే అక్షయపాత్ర

అజ్ఞానమనే చీకటిని తరిమితేనే కదా
విజ్ఞాన వెలుగులు లోకంలో ప్రసరించేది
విజ్ఞానం జగతికి వెలుగునింపే కిరణం

యువకవిని అక్కున చేర్చుకుంటేనే కదా
నవ కవిత్వానికి నాందీ వాచకమవుతాడు
అతడు కవిత్వమై మెరిసే కాంతిపుంజం.

-డా.్భంపల్లి శ్రీకాంత్ 90328 44017