Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. ఏరికోరి యఁడగవచ్చు నేదియైనఁ
బిలచి పిల్లల ఁ బద్ధతిఁబెంచకున్నఁ
దుదకు దుఃఖంబు సంద్రమై కుదిపివేయుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: పిల్లలకు కావలసినవి, వారుకోరుకున్నవి అన్నీ ఏరి కోరి మరీ ఈయవచ్చును. కానీ పెంపకం విషయంలో మాత్రం క్రమశిక్షణబద్ధంగా పెంచాలి. అలా పెంచకుండా అతిగారాబం చేస్తే మాత్రం ముందు ముందు తల్లిదండ్రులే కాక సమాజం కూడా దుఃఖించవలసి వస్తుంది. ఆ దుఃఖ సముద్రమై జీవితాలను కుదిపివేస్తుంది. ఈ విషయాన్ని కర్మసాక్షివైన ఓసూర్యదేవా! నీవే ఈలోకానికి తెలియజెప్పాలి ప్రభూ!
తే.గీ. నాగరికమను పేరిట నగవరేవి
చిత్రవేషాలు! పంట్లాలఁ జింపుకొనుట!
లకట! యాడమగను భేదమంతరించెఁ
జూడుమో కర్మసాక్షి ! యోసూర్యదేవ!

భావం: నేటికాలంలో నాగరికత పేరుతో విచిత్రములైన వేషాలకు తోడు పంట్లాలు కావాలని చింపుకుని తిరగడాలు, స్ర్తిపురుష భేదం లేకుండా వస్త్రాలు ధరించడం సాధారణమైపోయాయి. వస్త్రాలు భారతీయ సంస్కృతిని తేటతెల్లం చేసేవి కూడా అని తెలియని యువతను, పైగా వీటిని ధరించడం వల్ల వచ్చే అనేకానేక నష్టాలను బేరీజు వేసుకొనలేకపోయే యువతను నీవే కాపాడాలి ఓ కర్మసాక్షివైన ఓ సూర్యదేవా!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262