Others

గాంధీ చెప్పిన హింస - అహింస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది 1917. అహ్మదాబాదులో ప్లేగ్ వ్యాపించింది. వస్త్రాల మిల్లుల యజమానులు పనివాళ్ళ భత్యం పెంచి వారు వెళ్ళిపోకుండా జాగ్రత్తపడ్డారు. కొంతకాలం గడిచింది. ప్లేగు తగ్గుతోంది. మిల్లుల యజమానులు భత్యం ఇవ్వడం మానివేశారు. అదే సమయంలో మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా ద్రవ్యోల్బణంతో పెరిగిన ధరలు. ఇలాంటి సమయంలో భత్యం ఆపి, జీతం పెంచకపోవడం సమస్య అయ్యింది కార్మికులకు. మిల్లు యజమానులు వినడం లేదు. కార్మికులు గాంధీ దగ్గరకు వచ్చారు. అప్పటికి ఆయన చంపారన్ నీలిమందు రైతుల సమస్యలను సత్యాగ్రహంతో దారికి తెచ్చారు. గాంధీ ప్రవేశించిన తర్వాత కూడా యాజమాన్యం 20 శాతం బోనస్ దగ్గర ఆగింది. గాంధీ 35 శాతం పెంపు ప్రతిపాదించాడు. మిల్లు యాజమాన్యం అంగీకరించలేదు. దాంతో గాంధీ సమ్మె చేయాలని కార్మికులకు సూచించారు. అయితే సమ్మె కార్మికులు విధిగా కొన్ని నిబంధనలు పాటించాలి - అవి ఏమిటంటే :
అ) అహింస.. ఆ) యాజమాన్యానికి విధేయులైన
కార్మికులకు హాని చేయకపోవడం
ఇ) మిల్లు ఆస్తి నష్టం చేయకుండటం.. ఈ) దృఢదీక్ష
సమ్మె మొదలైంది. ప్రతిరోజూ సబర్మతి ఒడ్డున గాంధీ ప్రసంగించేవారు. రోజూ ఒక న్యూస్ బులెటిన్ విడుదల చేసేవాడు గాంధీ. కొన్ని రోజుల తర్వాత వచ్చే కార్మికులు తగ్గిపోయారు. కార్మికులను సంఘటితం చేయడానికి గాంధీ నిరాహారదీక్షకు దిగారు. దీంతో కార్మికులే కాదు, యాజమాన్యం కూడా కదిలి వచ్చి 35 శాతం పెంపుకు అంగీకరించింది. మొత్తం వివాదం ట్రిబ్యునల్‌కు అప్పగించాలని నిర్ణయించారు.
అది ప్రజా ప్రయోజనం కోసం భారతదేశంలో జరిగిన మొదటి నిరాహారదీక్ష. సత్యం అహింసల ఆధారంగా గాంధీ సత్యాగ్రహ భావనను రూపకల్పన చేశారు. 1906 సెప్టెంబరు 11న దక్షిణాఫ్రికా లోని జొహనె్నస్ బెర్గ్ పట్టణంలో ఎంపైర్ థియేటర్‌లో అక్కడి ప్రభుత్వం ప్రతిపాదించిన ఆసియాటిక్ రిజిస్ట్రేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ గాంధీ సత్యాగ్రహ భావనను ప్రతిపాదించారు. అప్పటికి పూర్తిగా కొత్త ఆలోచన సత్యంలో అహింస కూడా అంతర్భాగమంటారు గాంధీ.ముందు అహింస గురించి గాంధీ ఆలోచనలు! 1920 ఆగస్టు 18 ..........గాంధీ ఇలా రాశారు.....ప్రతి చెడు తలపు, తగని తొందరపాటు, అనృతం, విద్వేషం, ఇతరులెవరైనా చెడిపోవాలనే కోరికా - ఇవన్నీ అహింసా సూత్రానికి విరుద్ధాలు. ప్రపంచానికి కావలసింది ఒకరు తన వద్ద ఉంచుకుంటే హింసించిన వాడౌతాడు. సత్యం, అహింసలు ఒకదానితో మరొకటి పెనవేసుకుని ఉంటాయి. అహింస సాధనం సత్యం సిద్ధి....సజీవమైన దానిని హింసించకపోతే చాలు అనుకుంటే సరిపోదు.
హింస గురించి గాంధీ భావన చూద్దాం. మానవునికి సృష్టించే శక్తి లేదు. అందుచేత జీవించే ఏ చిన్న ప్రాణినైనా చంపే అధికారం లేదు.
సబర్మతీ ఆశ్రమంలో పొట్టిశ్రీరాములున్న గదిముందు రెండున్నర అడుగులున్న త్రాచు తిరుగుతోంది. కొత్తగా ఆశ్రమంలో చేరిన ఒక యువకుడు ఒక రాయి విసిరితే ఆ పాము మధ్యకు తెగి రెండు ముక్కలైంది. దాంతో తలభాగం పాము నానా యాతనకు గురై, మెలికలు తిరుగుతోంది. పొట్టి శ్రీరాములు దాన్ని చూడలేక వేదపడుతున్న పామును పూర్తిగా చంపమని ఆ యువకుడిని వేడుకున్నాడు. దీన్ని గమనించిన వారు పొట్టి శ్రీరాములు మీద గాంధీకి ఫిర్యాదు చేశారు. దీనికి పొట్టి శ్రీరాములు చెప్పిన వివరణ విని ‘‘అవును, ఇదే నిజమైన అహింస. కొన్ని రోజుల క్రితం ఆశ్రమంలో ఒక ఆవు దూడకు ఏదో వ్యాధి వ్యాపించింది. ఏ వైద్యానికి తగ్గలేదు. ఆ దూడ ఒక పక్క నుంచి మరో పక్కకు తిరగలేకుంది. కనుక దాన్ని జీవకారుణ్య దృష్ట్యా వధించి, యాతనను విరగడ చేయడం ఉత్తమం అనిపించింది. గాంధీ ఆవుదూడ గురించి తీసుకున్న నిర్ణయానికి చాలామంది ఆశ్చర్య పోయారు. గాంధీ దృష్టి విలక్షణమైంది. ...‘దక్షిణాఫ్రికా సత్యాగ్రహం’ గ్రంథంలో గాంధీ ఇలా అంటారు. ...‘‘వేలాది వేల సంవత్సరాల నుండి పశుబలమే ప్రపంచాన్ని పాలిస్తోంది. దీని దుష్పలితాన్ని అనుభవించి, అనుభవించి మానవకోటికి రోత పుట్టింది. హింస వలన ప్రపంచానికి మేలు జరుగదు. చీకటి నుండి వెలుతురు రాగలదా?’’
‘‘హింసించి’’ హక్కులను స్థిరపరచు కోవడం తేలిక మార్గంగా కనిపించవచ్చు. కానీ పోను పోనూ ఇది కంటకావృత మార్గమవుతుంది. ఈతగానికి నీటి గండం, సైనికునికి కత్తి గండం తప్పదు (యంగ్ ఇండియా 1928 ఆగస్టు 6).
ఇంకా అంటారు: ‘‘కోపం అహింసకు శత్రువు. ఇక గర్వం అహింస పాలిటి రాక్షసి. గర్వం అహింసను మింగి ఊరుకుంటుంది9. అహింస క్షత్రియుల మతం. మహావీరుడు క్షత్రియుడు. బుద్ధుడు క్షత్రియుడు. రామకృష్ణులు క్షత్రియులు. వీరందరూ అహింసా ప్రచారం చేశారు. వీరి పేరిట మనం అహింసను ప్రచారం చేయాలి9 కానీ నేటి అహింసను వైశ్యులు గుత్తకు తీసుకున్నారు. అందుచేత నేడు అహింస అవమానింప బడుతోంది.’’ చాలా జాగ్రత్తగా గమనించి, వాస్తవికంగా వ్యాఖ్యానిస్తారు గాంధీ. ఆయన ఉన్నత స్థాయి సిద్ధాంత కర్తే కాదు, చాలా నింపాది అయిన అనువర్తకుడు కూడా! ప్రతి అంశాన్ని జవహర్ లాల్ ‘బహురూపి’ పుస్తకం ముందుమాటలో పేర్కొన్నట్టు సమగ్రంగా, శాస్తబ్రద్ధంగా అధ్యయనం చేస్తారు. అదే ఆయన మానవతా వాదంలో విశేషం అని కూడా నెహ్రూ వివరిస్తారు. అహింసకు ఆనవాలు శాంతి, సహనం, ప్రేమ. గాంధీ భావన చాలా సమగ్రంగా, ఆశ్చర్యకరంగా ఉంటుంది. హింసకు పరాకాష్ఠ చంపడం. చావుకు వ్యతిరేకం పుట్టుక. పుట్టుకకు మూలం స్ర్తీ పురుషుల కలయిక. కనుక స్ర్తీ పురుషుల సంయోగం ఒక శాంతిదాయకమైన చర్య అని కూడా ఆయన భావిస్తారు. ఇది చదవండి - గాంధీ ఇలా అంటారు ‘యంగ్ ఇండియా’ పత్రిక 1920 ఆగస్టు 11 సంచికలో -
నేను 1908వ సంవత్సరంలో దారుణమైన దౌర్జన్యానికి గురి అయ్యాను. ఆ దౌర్జన్యానికి నేను మరణించి ఉండవలసిందే. ఈ దౌర్జన్యం గురించి నా పెద్ద కుమారుడు ఇలా ప్రశ్నించాడు - ఆ సమయంలో నేను అక్కడే ఉండటం తటస్థించిందనుకోండి. మిమ్ముల ను హత్య చేయడం చూస్తూ నిలబడాలా లేక నా శక్తి కొలది బలాన్ని ఉపయోగించి మిమ్ము లను కాపాడాలా?బలాన్ని ఉపయోగించి నన్ను రక్షించటమే ధర్మమని అతనికి చెప్పాను. అందువల్లనే బోయర్ యుద్ధంలో పాల్గొన్నాడు.
భారతదేశ పరువు ప్రతిష్ఠలకు భంగం కలుగుచుండగా పిరికిపందలవలే నిలబ డటంకంటే భారతీయులుబలాన్ని ప్రయోగిం చి, గౌరవాన్ని కాపాడటం మంచిదంటున్నారు. కానీ హింసా విధానం కంటే అహింసా విధానం వేయిరెట్లు మెరుగని నా దృఢ విశ్వాసం.’’కనుక గాంధీని అర్థం చేసుకోవాలంటే సూక్ష్మమైన మేథస్సు అవసరం, అలాగే గాంధీ అహింసా విధానం పాటించాలంటే ఓపిక, పట్టుదల, ధైర్యం ఇంకా ఎక్కువ అవసరం.

- డా. నాగసూరి వేణుగోపాల్ 944073232