Others
నవ్వుకుందాం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 1 October 2019
- యాములపల్లి నరసిరెడ్డి 9603759059
తడికి దూరమైన తులసిమొక్క
పొడిబారి పండుదై పోయినట్టు
నువ్వు నవ్వుకు దూరమై
రాలిన పువ్వై పడున్నావ్
వాణ్ణి చూడు నవ్వించడానికి
ఎన్ని వేషాల్లో శ్రమపడుతున్నాడో
ఎన్ని సన్నివేశాల్ని వివరిస్తున్నాడో
వీణ్ణి చూడు నవీ.. నవీ
రోజురోజుకీ ఎంత గెలివిగా మారాడో
ఇక్కడ ఏ పక్షో... జంతువో... జలచరమో...
నవ్వదు
నవ్వాల్సింది, నవ్వించాల్సింది నరుడే
అది వాడి హక్కు, ఆస్తి కూడా.
ఏడుస్తూ పుడతాం, ఏడ్పుల మధ్య పోతాం
ఏడిస్తే వచ్చేది ఏమీ లేనప్పుడు
నవ్వితే పోయేది ఏముంటుంది
ఒక్క దిగులుకు భంగపాటు తప్ప
వెకిలి నవ్వుల జోలికి పోకుండా
వెంపర్లాటల చేతికి చిక్కకుండా
నడిచే నవ్వుల చెట్లై నవ్వుల పువ్వుల్ని
పిలపిలా రాల్చుతూ
నవ్వుకుందాం మిత్రమా!