Others

ముక్తకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలం
పరుగెత్తుతూనే ఉంటుంది
కాలంతోపాటు
కదలిపోవడమే
మనిషి చేయవలసింది
మనిషి అంటేనే
మానవమూర్తి
మానవత్వం పంచుతుంటేనే
మనిషికి కీర్తి

ఆడది అంటే
ఆడుకునే బొమ్మకాదు
అవనికే అమ్మ
ఆదిపరాశక్తి
మహాకవి వ్రాసే
ప్రతి వాక్యంలోనూ
అనేకార్థాలు
అనంత జీవన సత్యాలు
లోకాన్ని వంచించడం
ఓ కళ అనుకోకు
టక్కున నిన్ను తనె్నవాడు
ఎక్కడో ఉంటాడు
నీవు వేదాలు చదివినా
వాదాలు చేసినా
పరోపకారంతోనే
బ్రతుకుకు సార్థకత
అన్నా! అన్నావో ఆప్యాయంగా
అవతలివాడు ఆశే్లషిస్తాడు
ఓరీ! అన్నావో పొగరుగా
ఒళ్ళు హూనం చేస్తాడు

పేదోళ్ళ కడుపులు
కొట్టేవాడు ఓ దురాత్ముడు
ఆకొన్న వాళ్ళకు
అన్నంపెట్టేవాడు పరమాత్ముడు

ఊషర క్షేత్రాల్లోకి
పారించు నీళ్లు
పచ్చపచ్చగా పంట చేలు
భవిష్యత్తులో రాజనాలు
నడుస్తూ పో
చేరుతావు గమ్యం
పాడుతూ పో
అనగ అనగ రాగం

- డా.తిరునగరి, 9392465475