Others

తలుపులు లేవు.. ఆంక్షలున్నాయ్! ( వార్త- వ్యాఖ్య )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహారాష్టల్రోని అహ్మద్‌నగర్ జిల్లా శని శింగణాపూర్ గుడి, ముంబయిలోని సూఫీ సాధువు హాజీ అలీ దర్గా సరేసరి.. వీటి కంటే ముందు కేరళలోని శబరిమలై అయ్యప్పగుడి.. వీటి లోపలికి స్ర్తిలకు ప్రవేశం లేదు. శబరిమలైలో వృద్ధనారీమణులకు, బాలికలకు మాత్రమే ప్రవేశం ఉంది. శని శింగణాపూర్‌లో ఆడవాళ్లు శనిదేవుడి ‘శిల’మీద తైలాభిషేకం చేయడం, పూలుపెట్టి పూజ చేయడం నిషిద్ధం. మొన్న రిపబ్లిక్‌డే నాడు శని దేవాలయంలోకి ‘్భమాత రణరంగిని సేన’కి చెందిన తృప్తి దేశాయ్ నాయకత్వంలో సుమారు 350 మంది మహిళలు- ‘శని శింగణాపూర్ శనిదేవుడికి తైలాభిషేకం స్వయంగా చేస్తాం’ అని బయలుదేరారు. వాళ్లని పోలీసులు సుమారు అరవై కిలోమీటర్ల దూరంలోనే అటకాయించారు. దీంతో శని శింగ్‌ణాపూర్ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిపోయింది. ఈ దేవాలయానికి అసలు తలుపులుండవ్. నిజానికి ఈ గ్రామంలో ఉన్న నాలుగైదువేల గడపలకీ కూడా గుమ్మాలే తప్ప తలుపులు లేవు. నాలుగు వందల ఏండ్లనాటిదనుకుంటున్న శనీశ్వరుడి మందిరం లోపల మండపం మీద ఐదడుగుల శిల ఒకటి (స్వయం భూ అని భక్తుల నమ్మకం) నిత్యం తైలాభిషేకాలు- కేవలం పురుషుల చేతి మీదుగానే అందుకున్న సూర్యపుత్ర శనిదేవునిగా భాసిస్తున్నది. స్వామి తననెత్తి మీద పైకప్పుగానీ, ఎలాంటి ఆచ్ఛాదన గానీ వుంచకూడదన్నాడు.
శని అమావాస్య, శని త్రయోదశిలాంటి పర్వదినాల్లో అక్కడ ఇసుక వేస్తే రాలనట్టుగా జనం వస్తారు. ఆలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించిన ఉద్యమానికి పోయినేడాది నవంబర్ 28న జరిగిన ఒక సంఘటనే ప్రేరణ. ఆనాడు శనివారం ఆలయంలో కిటకిటలాడుతున్నారు భక్త జనం. సి.సి. కెమెరాలున్నాయి. అంతలో ఒక యువతి నల్లని సల్వార్, తెల్లని కమీజు ధరించి మెరుపుతీగలా మూల విరాట్టున్న మండపం మీదికి ఎక్కేసింది. తైలాభిషేకం, పుష్పాంజలి రెండూ చకచకా ముగించుకుని, వెనుదిరిగి ఒక్కసారి జనాల్ని దాటి మాయమయింది. సి.సి. కెమెరాల నుంచి ఫుటేజీ టెలివిజన్ ఛానల్స్‌కి ఎక్కింది. ఈ వార్త దావానంలా వ్యాపించింది. మర్నాడు ఆ ఊళ్లో అంతా బంద్ పాటించారు. శనిదేవుని శిలకి తైలాభిషేకం, క్షీరాభిషేకం చేసి శుద్ధిచేశారు. ఈ సంఘటన నారీలోకాన్ని తట్టిలేపింది. ఈ ఉద్యమాన్ని చూసి ముంబయి లోని హాజీ అలీ దర్గాలోనికి 2011లో నిలిపివేసిన ‘నారీ ప్రవేశాల’ను పునరుద్ధరించాలని అఖిల భారత ముస్లిం మహిళా ఆందోళనకారులు కదం తొక్కుతున్నారు.
హాజీ అలీదర్గా సమస్య, శని శింగణాపూర్ ఆలయ ప్రవేశ సమస్య కూడా కోర్టుకెక్కాయి. ఇప్పటికే శబరిమల కేసు సుప్రీం కోర్టులో వున్నది కనుక దీని మీద ఆ ‘పెద్దకోర్టు’ ఏముంటుందో ముందు చూద్దామన్నది ముంబయి కోర్టు. ‘రెండు వేర్వేరుదారుల్లో స్ర్తిలనీ, పురుషులనీ వదలకూడదా?’-అంటూ జడ్జీగారు దీనంగా మొహంపెట్టి సూచించారు. కానీ హాజీ అలీ దర్గా నిర్వాహకులు ‘ససేమిరా’ అంటున్నారు. ఇదిలావుండగా, ముంబయి హైకోర్టులోని ఔరంగాబాద్ బెంచ్ ఓ ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్) విచారించి మహారాష్ట్ర గవర్నమెంట్‌కీ, కేంద్రప్రభుత్వానికీ, అహ్మద్‌నగర్ జిల్లా అధికారులకీ కూడా నోటీసు పంపింది. ఈనెల 16కి కేసును వాయిదా వేసింది. ఈలోగా స్ర్తిలు శనిదేవుడి శిలకి తైలాభిషేకం చేయడానికి ఒప్పుకోవల్సిందేనని అడిగే ధైర్యం ఎవరికీ లేదు. కనుక మహారాష్ట్ర ముఖ్యమంత్రి సైతం నీళ్లు నమిలాడు. ఈ గుడి ట్రస్ట్‌బోర్డు నేషనల్ కాంగ్రెస్ పార్టీ గుప్పిట్లో ఉందిట. అదో రాజకీయం అయ్యే ప్రమాదం ఉంది. కేంద్ర మహిళా శిశు సంక్షేమమంత్రి మేనకాగాంధీ ఈ వివాదంపై మాట్లాడుతూ- ‘దీనికి రాజకీయ పరిష్కారం ఉండదు. ఉభయులూ కలిసి కూర్చోవాలి’ అంటూంటే, మధ్యప్రదేశ్ హోం మంత్రి బాబూలాల్ గౌర్ మాత్రం- ‘ఆడాళ్లు యించక్కా ఇండ్ల దగ్గర పూజలు చేసుకోవడమే బెటర్’ అని సెలవిచ్చారు. ‘అమాత్యుల వారూ.. శనిదేవతకి ఇళ్లల్లో ఎవరూ పూజలు చెయ్యరయ్యా!’ అని ఇంకొందరు ఆగ్రహం ప్రకటిస్తున్నారు. మొత్తం మీద ఎవరిమట్టుకు వాళ్లు శింగణాపూర్ శనిదేవుడి వూసెత్తితే- ‘ఏలినాటి శని పట్టుకుంటుందేమోనన్న’ట్లు తప్పించుకుంటున్నారు. శింగణాపూర్ మీదుగానే షీర్డి వెళ్లే బస్సులు భక్తులతో వెళుతుంటే తలుపులు లేని ఇళ్లు కనబడతాయి. ఆఖరికి ఆ వూళ్లో యూకోబ్యాంకు శాఖ కూడా పెట్టారు. బ్యాంకువాళ్లు తలుపులకు తాళం వెయ్యడానికి భయపడి ఎలక్ట్రానిక్ రిమోట్ కంట్రోల్ పెట్టారు. కాకపోతే- ‘పద్మవిభూషణ్’ బిరుదును అందుకోబోతున్న ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ ఇరు వర్గాలతోనూ మాట్లాడుతున్నారు. ఈ నెల 7న అక్కడికి వెళ్లి ఉభయతారకమైన మార్గమేదయినా వున్నదేమో చూస్తానంటున్నాడు ఆయన. శనిదేవుడి దయ ఎవరి మీద పడుతుందో చూడాల్సిందే మరి!

-వీరాజీ