AADIVAVRAM - Others

శుభాకాంక్షలు( సండేగీత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్య వాట్సప్ గ్రూప్‌లు ఎక్కువై పోయాయి. ఉదయానే్న గుడ్‌మార్నింగ్‌లు, రాత్రి గుడ్‌నైట్‌లు, వీడియోలు, ముచ్చట్లు ఇట్లా ఎన్నో.
అదే విధంగా ఆ గ్రూప్‌లోని ఎవరైనా సభ్యుని జన్మదినం ఉందని తెలిస్తే చాలు. లెక్కలేనన్ని జన్మదిన శుభాకాంక్షలు. పరిచయం లేకపోయినా శుభాకాంక్షల పరంపర కొనసాగుతూనే ఉంటుంది.
ఇది అవసరమా?
అవసరం లేదా నన్న ప్రశ్న పక్కన పెడితే ఒక విషయం అర్థమవుతుంది.
శుభాకాంక్షలు చెప్పడం వల్ల ఎదుటి వ్యక్తి ఆనంద పడతాడు. ఇది మానవ నైజం.
శుభాకాంక్షలు చెప్పడం వల్ల చెప్పే వ్యక్తి ఖర్చు పెట్టేది ఏమీ ఉండదు. అందులో ఎలాంటి త్యాగం లేదు. ఓ చిన్న శుభాకాంక్ష ఎదుటి వ్యక్తిలో ఎంతో ఆనందాన్ని నింపుతుంది.
ఓ చిన్న మంచి మాట వల్ల ఆ మాట విన్న వ్యక్తిలో ఎంతో మార్పు వచ్చే అవకాశం ఉంది.
శుభాకాంక్షలు చెప్పాల్సిన సందర్భం వస్తే శుభాకాంక్షలు చెప్పాల్సిందే.
ఓ మంచి మాట చెప్పాల్సి వస్తే ఓ మంచి మాట చెప్పాల్సిందే.
అది కూడా మన మనస్సు నుంచి చెప్పాలి.
మన హృదయం నుంచి చెప్పాలి.
ఓ విషయం మరిచిపోకూడదు.
శుభాకాంక్షలు చెప్పడం వల్ల ఎలాంటి ఖర్చు లేదు. త్యాగమూ లేదు. ఎలాంటి ఇబ్బందులూ లేవు.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001