AADIVAVRAM - Others

అభిమతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కులం వ్యక్తిగతం
మతం మనోగతం
మానవత్వం అందరి అభిమతం
కులమతాలు కలిగించవు
అభిప్రాయ భేదాలూ, ఖేదాలూ
మతిభ్రమించిన రాజకీయ నాటకీయాలు
ఓట్ల కోసం, సీట్ల కోసం, నాటిన విష వృక్షాలు
కులమతాలెప్పుడూ మతాబులే
మానవులందరికీ జవాబులే
లాభనష్టములూ, ఇష్టానిష్టములూ
ధర్మాధర్మములూ, కర్మాకర్మములూ
ఎవరివి వారివే అయినా అవనిలో
అందరూ సమానులే
ఆత్మజ్ఞాన సంరక్షణకు
అందరూ జవానులే
అందుకే అంతరాత్మ అంటున్నది వినాలి
ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి
సేవా భావాన్ని పంచుకోవాలి
రాగద్వేషాల్ని ద్వేషించాలి
రాక్షసగుణాల్ని త్యజించాలి
అప్పుడే మన దేశం సస్యశ్యామలంగా మారుతుంది
మనమంతా ఒక్కటే అన్న నినాదం నిజమవుతుంది
నిజంగా మనుషులమేనని ఋజువవుతుంది

-షణ్ముఖశ్రీ.. 8897853339