Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. ఉట్టిఁ గట్టును కలకాల మూగ్గులాడఁ
బోరు! కోపతాపంబుల జోరుఁ జూపి
యేమి సాధింతురో గదా! యేమి ఘనత?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఎవ్వరూ కలకాలం ఉట్టిగట్టుకుని ఊరేగ లేరు. మరి అలాంటప్పుడు బ్రతికిన నాలుగు రోజులూ కోపతాపాలను తీవ్రంగా కలిగియుండి సాధించేది ఏముందని? అదేమంత ఘనత? ఆగ్రహావేశాలు కలిగి యుండకుండా ఎల్లప్పుడూ శాంతియుత జీవితాన్ని గడపడమే శ్రేయోదాయకమని కర్మసాక్షివైన ఓ సూర్యదేవ నీవే అందరికీ చెప్పాలి స్వామి.
తే.గీ. వ్యర్థమవరాదు జన్మ సఫలత ఁ గాంచ
వలెను లేకున్న నేల రుూ బ్రతుకు భార
మరియు మదిలోనఁ దలపరే నేడు
చూడుమో కర్మసాక్షి ! యో సూర్యదేవ!

భావం:దైవ దత్తమైన ఈ జీవితం వ్యర్థం కారాదు. జన్మ సఫలతను పొందాలి. అలా సఫలీకృతం కాని బ్రతుకు భూమికి భారమే. ఈ విషయాన్ని తెలుసుకొనరెందుకో? కర్మసాయివైన ఓ సూర్యదేవా! కారణజన్ములైన మనుషులంతా తమ పుట్టుకకు అర్థాన్ని పరమార్థాన్ని కల్పించుకోవాలని తెలియచెప్పుమా స్వామి.

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262