Others
ఊగిసలాట
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 7 October 2019
- అభిరామ్, 9704153642

నేనో అక్షరాన్ని
సమాజానికి సమస్యలకు
మధ్య ఊగిపోతుంటాను
సమాజాన్ని బ్రతికించాలని
సమస్యలను చంపాలని
నేనో పదాన్ని
పదవికి పెదవికి మధ్య ఊగిపోతుంటాను
పెదవిలో పదమై నిలవాలని
పదవిలో ప్రగతిబాటై సాగాలని
నేనో వాక్యాన్ని
వేదనకు వాదనకు మధ్య ఊగిపోతుంటాను
వేదనను వెలివేయాలని
వాదనను జయించి
వెలుగుకు వేకువవ్వాలని
కవి మనసులో
పురుడుపోసుకున్నప్పటినుంచి
కాలానికి అతీతమై
కవిని తన ఒడిలోకి తీసుకుని మానవత్వ మనుగడకై
ఆలోచనల కెరటాలపై ఎగిసిపడుతూ
ఊగిపోయేదే కవి కలం