Others

భక్త్భివంతో సద్బుద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుడు సర్వాంతర్యామి. చిన్నారులకు చిన్ననాటినుండే భక్త్భివం కలిగించేందుకు పెద్దలు నిత్యం కృషిచేయాలి. ప్రహ్లాదుడు చిన్నతనంలో తల్లి గర్భం నుండే హరినామ సంకీర్తన చేసి లోకానికే ఆదర్శప్రాయుడైనాడు. ఇంకా ధ్రువుడు, లవకుశులు చిన్నారులుగానే ఆధ్యాత్మికతను సంతరించుకున్నారు. శ్రీకృష్ణుడు తన బాల్యంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందగలిగాడు. శ్రీరామచంద్రుడు వంటి మహనీయులు తమ చిన్ననాటి నుండే విశేష భక్తిప్రపత్తులతో నేటి చిన్నారుల మనసులను దోచుకున్నారు. అందుకే బాలల బొమ్మల రామాయణం, భాగవతం, మహాభారతం పుస్తకాలు చదవడంలో చిన్నారులు ఇప్పటికీ ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే వాటిలో చక్కటి సుగుణాలు కలిగించే అంశాలున్నాయి.
పిల్లల్లో భక్త్భివం వలన మనోవికాసం, ధార్మికత, ఉత్తమ సుగుణాలు అలవడతాయి. అకుంఠిత దీక్షతో ప్రహ్లాదుడు శ్రీహరినే సాక్షాత్కరింపజేసుకుని ఈ లోకానికి చక్కటి సందేశాన్ని అందించగలిగాడు. ఉదయం లేచిన వెంటనే చిన్నారులకు సూర్య నమస్కారం విధిగా నేర్పించాలి. కాసేపు ధ్యానం చేయించాలి. పిల్లలకు చిన్ననాటి నుండే ధ్యానం నేర్పించడం వలన వారి చదువుకు ఎలాంటి ఆటంకం కలుగదు. ధ్యానంవలన పిల్లల్లో ఉత్తేజం, విజ్ఞానం కలుగుతుంది. చదువుపట్ల మరింత ఆసక్తి ఏర్పడుతుంది. ఉత్సాహం వెల్లివిరుస్తుంది. ఆటల్లో ఆనందంతోపాటు, భక్త్భివంతో వారికి సంస్కారం కలుగుతుంది. సద్బుద్ధి లభిస్తుంది.
అమ్మ లాలిపాటతో బిడ్డకు గోరుముద్దలు తినిపిస్తూ చందమామనే చూపిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు అప్పుడప్పుడూ రామాయణ, భారత, భాగవతం గాథలు వినిపించాలి లేదా అలనాటి అపురూప బాలల భక్తిరస చిత్రాలు, భక్తప్రహ్లాద, లవకుశ, సంపూర్ణ రామాయణం, బాలభారతం, బాలలకు సంబంధించిన చిత్రాలు చూపించాలి. పౌరాణిక గాథలు చిన్నారులను ఇట్టే ఆకర్షిస్తాయి. భక్త్భివం చక్కగా అలవడే చిన్నారులలో సభ్యత, సంస్కారం కనిపిస్తుంది. పిల్లల్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలనుకునే తల్లిదండ్రులు, వారిలో కాస్త భక్త్భివం పెంపొందింపజేయాలి.
నుదుట బొట్టు, ముకుళిత హస్తాలతో నమస్కారం చేయంచి, దేవుడిపట్ల భక్త్భివం కలిగించాలి. చిన్నప్పటినుంచే భక్త్భివం అలవడిన చిన్నారులో ఆనందం వెల్లివిరుస్తుంది. ప్రతిరోజూ వారికి ఆటలు, ఆనందం చదువుతోపాటు భక్తిప్రపత్తులు నేర్పించడం వలన మెదడు చురుకుగా పనిచేస్తుంది. అది ధ్యానం వలన సాధ్యమవుతుంది. ఆధ్యాత్మిక భావంలో ధ్యానం ఒక వెలుగు. నేటి బాలలే రేపటి పౌరులుగా చిన్నారులు రాణించేందుకు ఇది సులభమైన మార్గం కాగలదు. భక్త్భివం వలన పెద్దలపట్ల గౌరవభావం చిన్నారులలో వికసిస్తుంది.

-ఎల్.ప్రపుల్లచంద్ర 8886574370