Others

సృ స్థి ల (సృష్టి స్థితి లయ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చూస్తూ చూస్తూ కాలిన ఆకాశం క్రింద
కాళ్ళు తెగిన ఒంటెలా..
వయసు మళ్లిన ఈవిడెవరో
ఒంటిమీద వసంతాన్ని పులుముకొంటూ...
అప్పుడు నన్ను పుష్పించిన తల్లి
ఇప్పుడు స్వప్నధూపంలో కూడా
సాక్షాత్కరించదు
ఆత్మ శిక్ష పొందిన వాణ్ణి కనుక
అక్షర పూజ చేశారు. అంతరంగాన్నలం కరించుకున్నాను
ఆద్యంతములు లేని యంభోదమువని
జగమే మహాంబోధి జన్మమొందు
అంతులేని యెడారి వింతలౌ యెండ మా
వులు జగం చే ప్రొద్దు పులకరించు
నామరూపాభిఖ్య నాటక చక్రంబు
నడచు నే దంగ చిన్మోత్ర వీధి
కడరేని బ్రహ్మాండ గంధర్వ నగరంబు
కనిపించు నే మహాగగనమందు
అది మహామాతృమాలిని యస్మదంత
రంగ చైతన్య వృత్తి ప్రసంగ మూర్తి
శివుడు సాక్షియ= కాడొ సచ్చిత్తరంగ
జలధి మాయమ్మవారు విశ్వ జనయిత్రి
***
ఊహ ఎంతటి చపల పదార్థమో ఉనికి పడే
ఆత్రం వెల్లడి చేస్తోంది
జ్వలించే కోరికల విడిది కేంద్రమైన దేహాన్ని
ఎంతగా పోషించుకుంటున్నాడో
జారిపోతున్న క్షణాల పారదాన్ని పట్టుకోలేక
పరితపిస్తున్నాడు మనిషి
ప్రసన్నకాలాన్ని ప్రత్యక్షం గానే గాయపరిచే
క్షణికోద్రేకాలకు శరీరాన్ని అప్పగించి
రేపటి జీవకిరణ స్వరూపాన్ని
మ్లానం చేసినా
తను రూపానే్న చెక్కుతోంది తరుణి తోటలో
సహాయంకోసం నిరీక్షిస్తున్న చెట్టుకున్న
నర్జీవ సుమానికి
ఒళ్లు విరుచుకుంటున్న గాలి నగ్నత్వాన్ని
పరిమళంతో కప్పలేని నిస్త్రాణ
పరుచుకున్న ఏటవాలు నీడలో
నీడ ఒంటరితనమే ఆరాటపడుతోంది

- ఇంకావుంది...

- సాంధ్య శ్రీ 8106897404