Others

అనాహత చక్రము సర్వ సౌభాగ్యప్రద చక్రము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్లో॥ అనాహతాబ్జ నిలయా శ్యామాభావదన ద్వయా
దంష్ట్రోజ్జ్వలా క్షమాలాది ధరా రుధిర సంస్థితా॥
కాళరాత్య్రాది శక్త్యౌ ఘవృతా స్నిగ్ధౌదన ప్రియా
మహావీరేంద్ర వరదా రాకిన్యంబా స్వరూపిణీ॥
కొట్టకుండానే శబ్దం వచ్చే చోటు కావున అనాహతమని పేరు వచ్చింది. అంతఃకరణ అని కూడా అంటారు. శ్రీ చక్రంలో సర్వసౌభాగ్యప్రద చక్రావరణ లేక మన్వస్రము అంటారు. 14 కోణాములు కలిగినది. ఇది రుద్ర స్థానం.
‘క’ నుంచి ‘్ఠ’వరకు గల మాతృకా వర్ణాలతో 12 దళాలతో ‘యం’ బీజంతో వాయుతత్త్వంతో ఈశ్వర సాథనమైన హృదయమందు పవిత్రమైన స్థితి చెందిన అనాహత చక్రమును హృదయమందు ధరిస్తున్నాను. ‘రాకినీదేవి’ ఈ చక్రాధిష్ఠాన దేవతయై ఉంది.
ఈ మాతృకాశక్తులు వరుసగా ‘క’ -కాళరాత్రి 2. ‘ఖ’ - ఖాతీత,2.‘గ’ - గాయత్రి,4. ‘ఘ’ -ఘంటాధారిణి , 5. ‘ఙ’- ఙమిని, 6.‘చ’- చంద్రా, 7. ‘్ఛ’ -్ఛయ, 8. ‘జ’-జయ, 9.‘ఝ’ -ఝంకారి, 10. ‘ఞ’ -జ్ఞానరూపిణి, 11. ‘ట’ - టంకహస్తా, 12. ‘్ఠ’ - ఠంకారిణి, ఈ 12 శక్తులు పరి వేక్షించియుండగా మధ్య కర్నిక లో వామదేవి యుండుట వల్ల ‘‘కాళరాత్య్రాది శక్తౌఘవృతా’’ అనబడుచున్నది. ఇచ్చటి ద్వాదశ పద్మకర్నికలో శ్యామలమగు దేహకాంతి గల ‘‘వామదేవి’’ అనే దేవతా శక్తి ఉంది. 16 సంవత్సరాల యువతిని కూడా శ్యామా అంటారు. అమ్మవారికి శ్యామాభా అను నామము కూడా కలదు. వామదేవి అనగానే ఉత్తరముఖుడైన శివుడు (పంచరుద్ర మంత్రాలలోని వామదేవముఖ మంత్రం) స్ఫురణకు వస్తాడు. ఈ వామదేవుని శక్తియే వామదేవి. ఈయనకే మనోన్మనాయ నమః అనిప్రార్థిస్తాము. అమ్మవారిని కూడా ‘‘మనోన్మనీ’’, ‘మనోమారుూ’ అను నామములతో పూజిస్తాం. ఇవి అమ్మవారి సహస్రనామాల్లో ఉన్నవే.
ఈ వామదేవి రెండు ముఖములు గలదనుటలో ఔచిత్యం ఏటంటే గర్భస్థ శిశువునకు మొదటి మాసములలో రసనేంద్రియ ద్వారం (నోరు) రెండవ మాసములో ఘ్రాణేంద్రియ ద్వారం, (ముక్కురంధ్రాలు ) ఏర్పడును. కావున వదన ద్వయా అని సూచితం. ఈ దేవిని రుధిర సంస్థితా అనుటలో హృదయ స్థానమందుండి రక్తమును శుద్ధి చేయునదిగా (గుండె చేసేపని) సూచితము. ఈమెను స్నిగ్దౌదన ప్రియా యనుటచే నేతితో తడిపిన అన్నము పై ప్రీతి కలదని అర్థం. రెండవ మాసగర్భిణికి స్నిగ్దౌదనము పథ్యముగా సూచితం.
శ్లో॥ హృత్ పద్మాం తే, ద్వాదశపత్రే కఠవర్ణే
శంభుం శేషం హసంస విశేషం
సమయతం స్వర్గస్థిత్య్తం, కుర్వంతం గురుమూర్తిం
ఈ చక్రం ‘్థమస్ గ్రంథి’ ని వ్యాధి నిరోధక శక్తిని, నియంత్రిస్తుంది. దీనిని ఆంగ్లంలో హళ్ఘూఆ ళళశఆళ అంటారు. ఇది హృదయ స్థానమందుండి ప్రాణశక్తి స్పందనను, ఉచ్ఛ్వాస నిశ్వాసలను నియంత్రించే వాయు తత్త్వంతో ఉంటుంది. ఈ చక్రమందలి 12 దళాలు ‘క,ఖ,గ,ఘ,ఙ, చ, ఛ, జ, ఝ, ఞ, ట,్ఠ అనే 12 అక్షరాల బీజాలను సూచిస్తుంది. ఈ చక్రాధిష్ఠాన దేవత ‘వామదేవ’ రెండు ముఖాలతో, శ్యామల వర్ణంతో ‘రాకిని’ శక్తిగా సప్త థాతువులలోని రక్త్థాతువు నకు అధిదేవతగా ఉంటుంది.
హృత్పద్మే భానుపత్రే ద్వివదన లసితాం దంష్ట్రినీం శ్యామ వర్ణాం
చక్రం శూలం కపాలం డమరుమపి భుజైరాధరయంతీం త్రినేత్రాం
రక్తస్థాం కాళరాత్రి ప్రభృతి పరివృతాం స్నిగ్ధ్భుకె్తైకసక్తాం
శ్రీమద్వీరేంద్ర వంద్యామ భిమత ఫలదాం రాకినీం భావయామి॥
ఇక్కడ వ్యాహృతి ఓం మహః ఈ అనాహత చక్రానికి భగవద్గీత 12వ యోగం = భక్తియోగానికి సమన్వయం చెప్పారు మన పెద్దలు. అలాగే ‘క’ నుండి ‘్ఠ’ వరకు 12 అక్షర బీజాలు కలిగిన అనాహత చక్రానికి ‘కఠోపనిషత్ సమన్వయం కూడా చెప్పారు. అనాహత చక్రం మన శరీరంలో గుండె వెనుక భాగంలో ఉంటుంది. వెనె్నముక లోని హృదయ నాడీ మండలము వద్ద ఉన్నది. దీనినే హృదయ కమలం అంటారు.
ఇది 600 నాడులు కలిగి మంకెన పువ్వు లాగా ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. ఇది ఒకసారి ఊపిరి పీల్చి వదిలేసరికి 600 సార్లు స్పందిస్తుంది. ఇది ప్రాణవాయువు యొక్క సంచాలనాలను నియంత్రిస్తుంది. అనాహత చక్రమందలి వాయుమండలంలో, కర్మేంద్రియమగు ‘లింగం’, ‘సర్పర్వతనాత్మ్ర’ ఉన్నా యి. ఈ చక్ర కర్ణికలో సూర్యమండలం ఉన్నది. దానితో కోటి కిరణ ప్రకాశంతో వెలుగొందే త్రికోణమున్నది. దీనిపైన పొగ రంగులో వాయుబీజమైన ‘యం’ అంకుశాన్ని ధరించి, జింక ఆకారంలో ఆసీనయైఉంది. ఈ వాయు బీజంలో త్రినేత్రుడైన ఈశ్వరుడు బాణలింగ రూపంలో ఆసీనుడై ఉన్నాడు. ఈయన తన రెండు చేతులతో వరాభయ ముద్రలను చూపుతున్నాడు.
ఈ కింద హంసాకారంలో జీవాత్మ, నిశ్చలమైన జ్యోతిరూపంలో ప్రకాశిస్తున్నది. (ఈవిషయాన్ని మనకు మంత్రపుష్పంలోని ఏడవ శ్లోకం నుండి 13వ శ్లోకం వరకు వివరించబడి ఉంది.) ఈ చక్రపు కర్ణికకు కింద మరియొక ఎర్రని పద్మం ఉంది. ఇది ఎనిమిది దళాలతో పైకి తిరిగి ఉంది. దీనియందు కల్పవృక్షము బాగుగా అలంకరింపబడిన హోమగుండము ఉన్నాయి. మహానిర్వాణ తంత్రములోయోగసాధకుడు మానసిక ఉపాసన చేయుటకు సరియైన స్థానముగా ఇది చెప్పబడినది.
శబ్దబ్రహ్మముగాచెప్పబడే నాదం. ఈ అనాహత చక్రంలో వినిపిస్తుంది. ఈ చక్ర ధ్యానం వల్ల మనిషి మంచి మేధస్సు, వాక్కులుకలిగి మంచి పనులు చేస్తూ విశ్వప్రేమాది కారుణ్య భావము కలిగి పూజ్యుడౌతాడు. ఈ అనాహత చక్రం శర్వుడనే నామంతో ఉన్న పరమశివునికి నివాస స్థానం.
శ్రీ ఆదిశంకరులు తమ సౌందర్యలహరిలో అనాహత చక్రాన్నీవిధంగా వర్ణించారు.
శ్లో॥ సమున్మిల లత్నం చిత్కమల మకరం దైక రసికం
భజే హంస ద్వంద్వం కిమపి మహతాం మానసచరమ్
యదాలాపాదష్ఠాదశగణిత విద్యాపరిణితిః
యదాదత్తే దోషాద్గుణ మఖిల మద్భ్యః పయివ (సౌల.ల. 38)
భావం: ఓ తల్లీ! భగవతీ! వికసించుచున్న జ్ఞానమను కమలము నందలి మకరందాన్ని ఆస్వాదించుటలో రసజ్ఞులగు యోగుల మనస్సులనబడు మానస సరోవరంలో ఇది అది యని నిర్దేశించి చెప్పుటకు శక్యము కానిదైన రాజహంసుల జంట అనగా శివపార్వతులను నేను భజిస్తున్నాను.
ఇంకా ఉంది