Others

మీ గమ్యమే నా గమ్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేనెప్పుడో
నా వాళ్ళని వదిలేసా
మీకోసం
మీవాళ్ళ కోసం

మీ గమ్యమే
నా గమ్యమైంది

మీరు ఏ రాత్రి ఎక్కడ
పడకేస్తారో
అక్కడే నా పడక
నేనేమో నా వాహనంలో
మీరేమో మీ ఇంట్లోనో
మీ బంధువుల ఇంట్లోనో

నా మార్గం
నా గమ్యం
నా చేతుల్లో లేదు
నా వాహనమే
నాకూ నా వాళ్లకు
ఆహార ప్రదాయిని

ఎగుడుదిగుడు దారులు
మూలమలుపులు
కొండలు లోయలు
నా మార్గంలో నిత్యం
ఒక చేతిలో స్టీరింగ్
మరో చేతిలో గేర్

కళ్ళన్నీ ముందూ వెనుకా
నిశిత పరిశీలన
నా చదువు అంతంతైనా
నా సామాజిక కోణంలో
అంతులేని మలుపులు

దూరమో దగ్గరో
తక్కువో ఎక్కువో
ప్రభుత్వ రంగమని
ఆశతో నేనూ సగటు మనిషిలా
సమ్మె హక్కుతో
నేను
అహంకారంతో అధికారం
నా కొలువుకే ఎసరు
ఎవడబ్బ సొమ్మని కులికేవాడు
మన సొమ్ముతో

మీరూ నేనూ
కలవకపోతే
విభజిస్తూ పొట్టకొడుతూ
వాడి పొట్టనింపుకుంటడు
జై కొట్టవే అన్నా! అక్కా!
చెల్లీ! తమీ!
అమ్మా! అయ్యా! ఆశీర్వదించవే!
మీ డ్రైవరును నేనే!

-గిరిప్రసాద్ చెలమల్లు 94933 88201