AADIVAVRAM - Others

ఈ వానొకటి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వానొకటీ
కురిసే కాలాలు మారుస్తుంటుంది.

లేలేత గాలికి హాయిగా ఊగాల్సిన
వరి ఆకు ఆవిరౌతుంటే
అలకబూనీ అలా మబ్బులపై దాగుంటుంది.

గాలి వీయటంలేదు
ఉక్కపోతలో వర్షాన్ని కలగంటాం.

చూస్తుండగానే
మబ్బుల ఆశలు తేలిపోతాయి.

మట్టి మనిషికి
బతుకంటే నీరే కదా
నీటికి ఎదురుచూపులు పరచడమే కదా!

బురద మడిలో ఉడుపు ఉడిసాక
వర్షం తడుపుతుందనీ తడి తడిగా నిలుపుతుందనీ!
ఆకుపచ్చ ఆశల్ని వేలాడదీసుకుంటాం.

కాళ్ల ముందు పంటే ఎండిపోతుంటే
గుండె తడి ఆరిపోతుందనీ
ఎన్నిసార్లు ఆకాశాన్ని ఎక్కుపెట్టి చూసినా
చినుకూ మొలవదు ఆశా చావదు

వడ్డీ రూపాయలు కళ్లల్లో
తేలుతూ భయపెడుతుంటాయి.

ఎంత గంభీర్యాన్ని వొంపినా
చినుకు రాలేనంతవరకూ
మొలకలు పంటగా హత్తుకోనంత వరకూ
అలజడులు రేగుతూనే ఉంటాయి

ఈ వానొకటీ
గడ్డిలా ఎండి కాలిపోయేక
ప్రళయమై ఊగుతూ ముంచుతుంటుంది.

-గవిడి శ్రీనివాస్ 9966 55601