Others

మళ్లీ.. హారర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిష వరుసగా దెయ్యం సినిమాలు చేయడానికే ఫిక్సైనట్టుంది. ఏకబిగిన హారర్ సినిమాలనే ఎంచుకుంటోంది. అగ్రతారలంతా ‘దెయ్యం’ సినిమాలు చేయడానికి సిద్ధమైన టైంలో -నాయకిగా వచ్చింది త్రిష. ఆ సినిమాతో మెప్పించలేకపోవడంతో ‘మోహిని’గా కనిపించబోతోంది. ఈ సినిమా కోసం విదేశాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగానే -తాజాగా హాలీవుడ్ హారర్ రీమేక్‌కు సంతకం చేసినట్టు తెలుస్తోంది. అదీ -హాలీవుడ్‌లో పెద్దగా ఆదరణకు నోచుకుని ఓ హారర్ చిత్రానికి సొగసుల అద్ది తీయబోతున్న సినిమాకు త్రిష ఒకే చెప్పినట్టు పరిశ్రమలో టాక్. నిర్మాత పంపిన డీవీడీ చూసి వెంటనే ఒప్పేసుకున్న ఆ చిత్రంలో త్రిష -ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు వినికిడి. చూస్తుంటే, త్రిష దయ్యాల దగ్గరే సెటిలైపోతుందా? అని పరిశ్రమలో జోకులు వినిపిస్తున్నాయి.