Others

వాళ్లకే సాధ్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రియమణి. అందమైన నటి. తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ. సెకెండ్ ఇన్నింగ్స్‌లో అనుకున్నంత ఆదరణ లేకపోవడంతో -్ఫ్యచర్ సినిమాపై దృష్టిపెట్టింది. అదేనండి -వెబ్ సిరీసుల్లో బిజీగా ఉంది ప్రియమణి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన నిజాన్ని వెల్లడించింది ప్రియమణి. హీరోయిన్ల పారితోషికాల గురించిన ప్రశ్న ఎదురైనప్పుడు -నిక్కచ్చి సమాధానమిచ్చింది. టాలెంట్‌కి తగిన పారితోషికం దక్కడంలేదన్నది చాలామంది హీరోయిన్ల అసహనం. మీరేమంటారు? అనే ప్రశ్నకి ప్రియమణి తనదైన శైలిలో స్పందించింది. ఉత్తరాది విషయం కాసేపు పక్కనపెడితే, దక్షిణాదిన పారితోషికాన్ని డిమాండ్ చేసే తారలు నావరకూ ముగ్గురే కనిపిస్తున్నారు. వాళ్లే నయనతార, అనుష్క, సమంత. డిమాండ్‌కు తగిన పారితోషికం ఇస్తేనే చేస్తామని నిర్మాతల వద్ద భీష్మించే అవకాశం వాళ్లకే ఉంది. మిగిలిన ఎంతోమంది హీరోయిన్లు నటనపరంగా ఓకే అయినా -పారితోషికాన్ని గట్టిగా డిమాండ్ చేసే సీన్ ఉందని నేననుకోవడం లేదు అంటూ సమాధానమిచ్చింది. ప్రియమణి చెప్పింది అక్షరాలా నిజమే మరి.