Others

సిరిసిరిమువ్వ.. హీరోగా బతికించింది ( ఆనాటి హృదయాల..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై టి నగరులో.. పాండీబజార్
ఆ పాండీబజార్ ఎంత పుణ్యం చేసుకుందో. ఎటువంటి కళాస్రష్ఠలు ఆ చెట్ల నీడలో సేదతీర్చుకొనేవారు? త్యాగరాయ భాగవతార్ నుంచి మద్దిపట్ల సూరి వరకూ అనుభవాల దొంతరలను పంచుకుంటూ. హమీదియా హోటల్లో వన్ బై టూ చాయ్ తాగి.. ఆంధ్ర కిళ్లీ షాపుదగ్గర పాన్ వేసుకుంటే.. స్వర్గం బెత్తెడు దూరంలో అనిపించేది. హమీదియా హోటలు ఎదురుగా గాలి బాలసుందరం మేడ-. ఆ మేడ సంగతి వినండి! ఔత్సాహిక రంగస్థల కళాకారులందరూ అక్కడే తిష్టవేసేవారు. మేడకింద చిన్నపాటి స్టేడియం వుంది. స్టేజీ లైట్లూ ఎరేంజ్ చేసి వుండేవి. పండగ పబ్బాలొస్తే ప్రదర్శనలిస్తుండేవారు. గాలి బాలసుందరం అంటే.. లతగారి అన్నయ్య. జలంధర నాన్న. చంద్రమోహన్‌కి మామ. సినిమాల్లో వేషాలు వెయ్యడానికి వచ్చి ఆశ నిరాశల మధ్య వ్యయ ప్రయాశలతో తిరుగుతున్నవారికి అదొక అమ్మఒడి!
ఆ మేడమీదే చంద్రమోహన్ ఉంటుండేవాడు. ఇది 1976 మాట. చంద్రమోహన్ వరకూ ఏ వేషమిచ్చినా బాగా చేసేవాడు. అయినా రెస్పాన్సు లేదు. ఒకప్రక్క శోభన్‌బాబు మరోప్రక్క కృష్ణ దూసుకుపోతున్నారు. అప్పట్లో ‘వెండితెర’ సినీ వారపత్రికుండేది. భాగ్యనగరం నుంచి వస్తుండేది. చెన్నైనుంచి నేను సమాచారం పంపిస్తుండేవాడ్ని. ముఖ్యంగా నేను రాసిన రివ్యూలు సినిమా పెద్దలందరూ విడిచిపెట్టకుండా చదివేవారు. సాయంత్రం పాండీబజార్లో కనిపిస్తే మనసు పరుచుకొని మాట్లాడుకొనేవాళ్లం.
ఆరోజు చంద్రమోహన్ కనిపించాడు.
పిచ్చాపాటీ మాట్లాడుతుండగా ‘మేడమీదే మా ఇల్లు. రోడ్‌వంక చూస్తూ మాట్లాడుకుందాం. జలంధరని పరిచయం చేస్తాను’ అంటూ మేడమీదికి తీసుకెళ్లారు. పరిచయాలయ్యాయి. అప్పటికే నేను అపరాధ పరిశోధన, యువలాంటి పత్రికల్లో కథలు రాశాను. ఈ అంశం జలంధరకి కనెక్ట్ అయ్యింది.
నిజానికి చంద్రమోహన్ సినిమాల్లో నటించడం జలంధరకి సుతరామూ ఇష్టంలేదు. అప్పటికే ఎగ్రికల్చర్ బిఎస్సీ చేశాడు. అయిదంకెల జీతం. గెజిటెడ్ ఆఫీసరుగా కొనసాగేవాడు. కానీ చంద్రమోహన్‌కి నటనే ఊపిరి. నిద్రాహారాలన్నీ నటనే! అప్పుడే విశ్వనాథ్ చిత్రం సిరిసిరిమువ్వ ప్రారంభమైంది. ఇది మ్యూజికల్ పిక్చర్. సంగీతం, నృత్యం ప్రధానంగా సాగే చిత్రం. జయప్రదకి అప్పట్లో అంత పేరు లేదు. విశ్వనాథ్ సినిమా చేస్తున్నారు. అది ఎక్కడికెళ్లి ఆగుతుందో తెలీదు. వేటూరి పాటలు. నిర్మాత సౌండ్ కాదు, ఏడిద నాగేశ్వరరావు. ప్రొడక్షనులో ఆచితూచి అడుగేస్తూ ఖర్చు పెడుతుండేవారు.
సినిమా పూర్తయ్యింది. ప్రివ్యూలు వేస్తున్నారు. సినిమా చూసినవాళ్లు పెదవ్విరిచేస్తున్నారు. సంగీత సాహిత్యాలైతే బావున్నాయిగాని గతంలో ఇలాంటి సినిమాలు ఎన్ని సినిమాలు బాక్సాఫీసు దగ్గర పల్టీలు కొట్టలేదు. కొంత కాలానికి ఆ సినిమాని చూడ్డానిక్కూడా బయ్యర్సు సుముఖత చూపించేవారు. అప్పట్లో ఈడ్పుగంటి లక్ష్మణరావు లక్ష్మీ ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు చూస్తుండేవారు. ఆయనకి బాగా నచ్చింది. లింగమూర్తి చూశారు. ఆఘ మేఘాలమీద సినిమా రిలీజ్‌చేశారు.
ఆ సినిమా విడుదల సందర్భంగా చంద్రమోహన్‌ని ఇంటర్వ్యూ అడిగాను. ‘బాబోయ్! ఇప్పుడేం వద్దు- సినిమా రిజల్టు రానీండి’ అన్నాడు. అయినా ఆ సినిమా గురించి ప్రతిరోజూ మాట్లాడుకొంటున్నాం. ఇంక కొత్తగా ఆయన చెప్పేదేముంది? ‘నటుడిగా సిరిసిరిమువ్వ పరిపూర్ణమైన తృప్తినిచ్చింది. స్టోరీ రాశాను. ఆ స్టోరీ చదివి చంద్రమోహన్ తబ్బిబ్బయిపోయి, ‘నా మనసుకి అద్దంపట్టినట్టుంది రామారావ్!’ అంటూ హత్తుకున్నాడు. వెనువెంటనే ‘సీతామాలచ్మి’ అదీ సూపర్ హిట్టే.. హీరోగా బిజీ అయిపోయాడు. సిరిసిరిమువ్వ చిత్రం విడుదలకి ముందు అనుభవించిన టార్చర్ అంతా మరిచిపోయాడు.
నేను నా రెండవ సినిమాకి చంద్రమోహన్‌ని డేట్స్ అడగ్గానే మారుమాట్లాడకుండా ఇచ్చాడు. ఆ చిత్రం పేరు సన్నజాజులు. గడగడా మాట్లాడుతూ కడుపులో ఏదీ దాచుకోని మనిషి. అందుకే నటుడిగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఈరోజు ఈ స్థితిలో వున్నాడు. ఎన్నివున్నా గతం మరిచిపోని స్నేహశీలి చంద్రమోహన్. అందుకే ఆయనకింత గొప్ప భవిష్యత్తు!

-ఇమంది రామారావు 9010133844