Others

మురళీకృష్ణ (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పద్మశ్రీవారి ‘మురళీకృష్ణ’ చిత్రానికి దర్శకుడు పి పుల్లయ్య. అర్ధాలు, అపార్ధాల మేలుకలయికతో సాగిన కుటుంబ ప్రేమకథా చిత్రం. కథానాయకి జమున -మురళి.. కథానాయకుడు ఏఎన్‌ఆర్ -కృష్ణ పాత్రధారులు. వెరసి -మురళీకృష్ణ.
కథాంశానికి వెళ్తే -హీరో హీరోయిన్లు లవ్‌లో పడటం, తండ్రి రిటైర్డ్ ఆర్మీ భయంకర్ (ఎస్వీఆర్) ఇష్టంపై పెళ్ళాడ్డం తెర ఎత్తగానే జరిగిపోతుంది. ఉల్లాసంగా సాగిపోతున్న సంసార నౌకాయానం.. చిన్న అపార్ధంతో చిన్నాభిన్నవౌతుంది. పెళ్లికి పూర్వం.. మురళి, స్నేహితురాలు శ్రీలత ఎగ్జిబిషన్‌కి వెళ్తారు. అక్కడ లక్ష్మీకాంతం గీసిన చిత్రానికి మురళి ముగ్దురాలై అభిమాని అవుతుంది. లక్ష్మీకాంతం స్ర్తి అన్న అభిప్రాయంతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగుతాయి. తర్వాత లక్ష్మీకాంతం కృష్ణకి స్నేహితుడై కలవడం... మురళితో తన ప్రేమ వివరించటం జరుగుతుంది.
మురళి సుఖ జీవితానికి పునాదులు వేస్తూ కృష్ణ విడివడి, ఎక్కడో మారుమూల గ్రామంలో వైద్య వృత్తి కొనసాగిస్తాడు. ఈ వార్త విన్న భయంకర్ (ఎస్వీఆర్) హార్ట్‌ఎటాక్‌తో మరణిస్తాడు. శ్రీలతని లక్ష్మీకాంతంకి జత చేస్తుంది మురళి. ఒంటరైన తను ఓ డాక్టర్ దగ్గర నర్స్‌గా కుదురుతుంది. మురళి నర్స్‌గా ఓ జమిందార్ (గుమ్మడి) మనోవ్యాధితో బాధపడ్తున్న కూతురు (గీతాంజలి)కి చేరువకావడం... ఆమె వైద్యుడైన కృష్ణని భ్రమలో ఇష్టపడడం, ఇలా ఎన్నో మలుపులు తిరిగి చివరాకరికి మురళీకృష్ణల కలయికతో సుఖాంతమవుతుంది.
కథ, కథనం, మాటలు, పాటలు, పాత్రధారుల కౌశలం.... అందునా అందర్నించీ ప్రతిభను రాబట్టగల దర్శకుడు పి పులయ్య.. సినిమా అద్భుతమైంది. సంభాషణలు మనసుకవి ఆచార్య ఆత్రేయ కావడం పుల్లయ్యకు కలిసొచ్చిన విషయం. గీత రచయితలు ఆత్రేయ, సినారె, దాశరథి. మాస్టర్ వేణు స్వర విన్యాసాలతో ఆంధ్రుల గుండెల్ని కదిపారు. ముఖ్యంగా ‘ఉ అను, ఊ ఊఁ అను’’/ కనులు కనులు కలిసెను పాటలు సినారె వ్రాయగా ‘గల్లుగల్లని’ పాట దాశరథి, మోగునా ఈ వీణ/ వస్తాడమ్మా నీ దైవము/ నీ సుఖమే నే కోరుతున్నా (ముచ్చటగా మూడు పాటలు) ఆత్రేయ వ్రాశారు.
అందుకే ఈ సినిమా నాకిష్టం...