Others

ఓహో మేఘమాల (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఓహో మేఘమాల నీలాల మేఘమాల’ పాట ‘్భలేరాముడు’ చిత్రానికి సదాశివబ్రహ్మం వ్రాయగా.. సాలూరి రాజేశ్వరరావు స్వరపర్చారు. పి.లీల ఆలపిస్తే.. సావిత్రి, నాగేశ్వరరావు, గిరిజలపై చిత్రీకరించారు దర్శకుడు వేదాంతం రాఘవయ్య. చిత్రంలో పాటను చెల్లెల్ని (గిరిజ) నిద్రపుచ్చుతూ అక్క (సావిత్రి) పాడటం జరిగింది.
ఓహో మేఘమాల/ నీలాల మేఘమాల/ చల్లగ రావేల మెలమెల్లగ రావేల/ ఇలీల దుడుకుతనమేల... ఊరుకోవే మేఘమాల/ ఉరుముతావేల మెరవగా నేల... అచ్చు మేఘాలని మనిషిగా ఎంచి సంభాషించినట్లు, ప్రశాంతత చూపమని సున్నన్నితంగా హెచ్చరించినట్లు ఉంటుంది లీల గాత్రం.
చరణంలో... గూటిలోన రామచిలుక నిదురపోతోంది/ చిలుక బెదరిపోతోంది/ తీయతీయని కలలుకంటూ మురిసిపోతోంది/ మైమరచిపోతోంది. పాట పండిత పామర రంజికం కావటానికి కారణం మనసులోని భావనలు సరళంగా... హృద్యంగా... మేఘాల కదలికలా సాగడమేనేమో మరి. ఈ పాట చిత్రీకరణలో వేదాంతం ఆసాంతం రాగానురాగాల వీవనలు పూయించడం, పాత్రధారి సావిత్రి ముఖ కవళికలలో పండించడం కావచ్చు. ఇదే ట్యూన్‌లో పంక్తులుమార్చి ఘంటసాల మాస్టారు పాడగా నటసామ్రాట్ అక్కినేని... నట శిరోమణి సావిత్రిని నిద్రపుచ్చుతూ హారం అలంకరిస్తాడు. దానే్న కవి భావనలో ‘ప్రేమ సీమలలో చరించి బాటసారి ఆగవోయి/ పరవశంతో ప్రేమ గీతం పాడబోకోయి అంటే హీరో... హీరోయిన్ ఆశలన్ని తారకలుగా హరమొనరించి, అలంకారమొనరించి/ మాయచేసి మనసుదోచి పారిపోతావా దొంగా పారిపోతావా’అంటుంది. ఈ గీతం సోలో మరియు డ్యూయెట్ చేయించారు సినిమాకోసం. ఎంతైనా గీత రచయిత సదాశివబ్రహ్మం కథాశివబ్రహ్మం కూడా మరి. అందుకే ఈ పాట అందరికీ నచ్చింది జనం మెచ్చింది కూడాను.