Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. అన్నమో రామచంద్రాయనంగలార్చు
వారికన్నమ్ము పెట్టిన ఫలమునెన్నఁ
చరమ యున్నమ్ముతోఁ దృప్తిఁ దలుపఁ తరమ!
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: అన్నమో రామచంద్రా! అంటూ ఎంతోమంది దీనంగా వేడుకుంటున్నారు.అలాంటివారికి భక్త్భివంతో పట్టెడన్నం పెట్టడం వల్ల కలిగే ఫలితాన్ని అంచనా వేయలేము. అన్నం పెట్టడం వల్ల తిన్నవారికి, పెట్టేవారికి కలిగే సంతృప్తి ఇంతా అంతా కాదు. ఆకలితో బాధపడేవారికి అన్నం పెట్టడం కంటే మించిన పుణ్యకార్యం ఈసృష్టిలో మరొకటి లేదని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ జగతికి ప్రబోధించవయ్య ప్రభూ!
తే.గీ. అకట! చదువేల? సంస్కారమబ్బకున్న
నాచదువునిరర్థకమె రుూ యవనిలోన
వారి కన్నను సంస్కారవంతులరయ
మిన్న యెన్నంగ సందేహమేమి లేదు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: అయ్యో! చదువెందుకు? సుసంస్కారం అలవర్చుకోలేని ఆ చదువు నిష్ప్రయోజనం కదా. చదువుకున్న మహా మహాపండితులకంటే ఏమాత్రం అక్షరజ్ఞానం లేని సంస్కారవంతులే ఎంతో గొప్పవారనడంలో సందేహం ఎంతమాత్రం లేదు. కర్మసాక్షివైన ఓసూర్యదేవా! ఈలోకం కనులు తెరిపించవయ్య స్వామీ!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262