Others

సృ స్థి ల (సృష్టి స్థితి లయ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొమ్మమీద వాలిన పక్షీలేదు
కొమ్మరాల్చిన పువ్వూలేదు
ప్రతి వస్తువు వ్యక్తిత్వాన్ని కోల్పోయి మసలుతున్న
ఈ చిత్రంలో
సమస్త మానవకోటి సృష్టిస్థితికి మూలమైన
ఏకైక చిహ్నం-
మనిషి మాత్రం అర్థం మిగలని అక్షరమయ్యాడు
జీవితం రాలుస్తున్న క్షణాలలోపడి
జీవన కోలాహలం చప్పరిస్తున్నాడు..
***
మట్టిలో నిద్రిస్తున్న కలల గంధాన్ని వెలికి తెచ్చే
ఒకానొక
అనిర్వచనీయ అంతర్మథనేష్టి
అర్ధాంతరంగా ఆగిపోయి
ఆకాశం నిండిన అవనీగర్భ సంజాతుడు
శూన్య దృక్కులతో శుష్కించిపోతున్నాడు...
వలయంలో
విలయం ఒక మజిలీ అనుకున్నాడేమో
కనిపించని స్వర్ధృక్కు
వినిపించని ఋత్విక్కు
గతి తార్కిక పదార్థమై
గమిస్తున్నాడు- ఆ
గమిస్తున్నాడు...
***
నాకెందుకో
కాలం తామరాకు మీద ఋతువులు మంచుబొట్లు
కదులుతున్నట్లుంది
ఏదో గీతిక ఎద మెదలుతున్నట్లుంది
ఆకాశపు నీలోదకాల్లో
తరుణీతారుణ్యమంతా తడిసి వస్తున్నట్లుంది
మమతల పందిళ్ళలో
మల్లెలు ఏరుతున్నట్లుంది
అనుభూతి సరస్సులో ఆత్మస్నానం చేసినట్లుంది
సంధ్యారేఖల మీంచి
స్వర్ణద్రవం పొర్లుతున్నట్లుంది
ఒక్క క్షణం
ఆరుసార్లు నా హృదయాన్ని మీటినట్లుంది
అంచులకోసం వెతుకుతుంటే
ఆకాశంలో కలిసిన భూమి కనిపించింది
కొమ్మమీద పక్షి కూర్చుంటే తోటంతా పాటే
రెమ్మ మీద పూవు విరిస్తే పాటంతా తావే

- ఇంకావుంది...

- సాంధ్య శ్రీ 8106897404