Others

సృ స్థి ల (సృష్టి స్థితి లయ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరుగిడుతున్న యువ చైతన్యం
చెప్పాచెయ్యకుండా చేయి జారిపోతుంటే
పెద్దరికం మీదికొచ్చి
‘‘కలత ఎరుగని లేత ప్రాయపు
తలిరుటెడదను తీగ నారిన
చెలిమి జ్ఞప్తికి వచ్చి కన్నులు
చెమ్మగిలిపోవున్’’
లొంగిన ఆకర్షణలు దూరంగా జరిగి
ఊపిరి ఆలాపన సాగిపోతుంటే
ఉనికి పై ఉపరితల ద్రోణి ఏర్పడి
‘‘బ్రతుకు పై విసుగెత్తి నెమ్మది
చితుకు మంటగ నుండ స్వప్నము
గతిని జ్ఞప్తికి వచ్చి యేదో
కలచు హృదయమ్మున్’’
అరే మిత్రమా!!
చూడు నా కళ్ళలోకి
ఆ రక్తనదుల కావల సిందూర సంధ్యల సమీపాన
ఆ చాంద్రీమయ నిశల కటువైపు
ఏముందో చూడు
ఎడతెగని సత్యదీప్తి తీగలు సాగిన స్వరంగా
సుఖదుఃఖాలకు రాగద్వేషాలకు ఆవల నిలచి
ననె్నదురు చూస్తున్న
మనవైపు నవ్వే క్షణాన్ని తెచ్చాను...
గొంతెత్తి పాడబోతున్న తామర పువ్వు నీడలో
తుమ్మెదను
గుండె చేసుకొచ్చాను

- ఇంకావుంది...

- సాంధ్య శ్రీ 8106897404