Others

ఆర్టీసీ సమ్మెకు అసలు కారకులెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ప్రాంతం ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రగిలిపోతున్నది. ‘ప్రభుత్వం మా సమస్యలను పట్టించుకోవడం లేదు.. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు వుంది కదా.. సమ్మెచేసే హక్కు మా జన్మహక్కు కదా! న్యాయమైన డిమాండ్లు తీర్చాలని సమ్మెకు దిగితే.. మొత్తం ఉద్యోగులను తొలగించామనడం చూస్తుంటే.. నియంతల రాజ్యం కన్నా భయంకరంగా పరిస్థితులు తయారయ్యాయి..’అని ఆర్టీసీ కార్మికులు విలపిస్తున్నారు. ఇద్దరు కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పాలకపక్ష నేతలు మాత్రం- ‘ఆర్టీసీ కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరారు. ఇప్పటికే భారీఎత్తున జీతభత్యాలు చెల్లిస్తున్నాము, అడగకుండానే నూతన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ 40% జీతాలు పెంచారు. రకరకాల రాయితీలు వున్నాయి. సీనియారిటీ స్థాయినిబట్టి ఆర్టీసీ ఉద్యోగులు 40వేల నుంచి 60వేల వరకు జీతాలు పొందుతున్నారు. డిమాండ్లను అడిగే పద్ధతిలో అడగకుండా- సరిగ్గా బతుకమ్మ, దసరా పండుగల సమయంలో కార్మికులు సమ్మెకు దిగడం ఎంతవరకు సమంజసం.. దసరా సెలవులు ముగిశాక చర్చలకు ఆహ్వానిస్తామని చెప్పినా వినకుండా, మంచి సమయంలో సమ్మెకు దిగారు’ అని ఆరోపిస్తున్నారు.
సెలవుల సందర్భంగా ఇతర ప్రాంతాలకు వెళ్లవలసిన ప్రజలు కిక్కిరిసిన రైలు బోగీల్లో ప్రయాణాలు చేశారు. ప్రైవేట్ బస్సుల ద్వారా వెళ్లినవారు వేలాది రూపాయలు ఖర్చు పెట్టారు. పండుగ రోజు సంతోషాన్ని పంచుకుందామని భావించిన పేదప్రజలకు ఆర్టీసీ సమ్మె చాలా కష్టాలను తెచ్చిపెట్టింది. ఉద్యోగాలు లేక లక్షలాది మంది నిరుద్యోగ యువతీ యువకులు అలమటిస్తుంటే, ఉన్న ఉద్యోగాలను సక్రమంగా నిర్వహించకుండా, బాధ్యతలు విస్మరించి హక్కులను మాత్రమే డిమాండ్ చేయడం సమంజసమా? అని వివిధ వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు. సందిట్లో సడేమియా అన్నట్టు కొన్ని రాజకీయ పార్టీల నేతల ఆర్టీసీ సమ్మెను తమ రాజకీయ లబ్ధికోసం ఉపయోగించుకునే ప్రయత్నంలో వుంటూ అగ్గి రాజేస్తున్నారు. మారుతున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల నేపథ్యంలో జీతాలు పెంచాలని కార్మికులు అడగడంలో తప్పులేదు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు లక్షలాది రూపాయలను గౌరవ వేతనాలు పొందుతూ, ఏసీ గదుల్లో నివసిస్తున్నారు. విలాసవంతమైన వాహనాల్లో తిరిగే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రభుత్వ ఖజానాకు భారీగా కన్నం వేస్తున్నారు. అనునిత్యం ప్రయాణీకుల కోసం కష్టపడే కార్మికులకు జీతాలు పెంచితే తప్పేమిటి? అని కొంతమంది విజ్ఞులు చెబుతున్నారు. పైగా తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారు కదా! అని గుర్తుచేస్తున్నారు.
మొత్తంమీద ప్రస్తుత ఆర్టీసీ కార్మికుల సమ్మెలో- తలాపాపం తిలాపిడికెడు అనే విధంగా అందరి వైఫల్యాలు వున్నాయి. పాలకపక్షం పంతానికిపోతూ ‘అసలైన విజయం మాదే.. నిబంధనలను పట్టించుకోని వారికి తోకలు కత్తిరించామ’ని గొప్పలు చెప్పుకుంటున్నది. మిగతా రాజకీయ పక్షాల నేతలు- ‘అగ్గిని బాగా రాజేశాం.. కేసీఆర్‌కు ఇపుడు ఎదురుగాలి ప్రారంభమయ్యింది. నైతిక విజయం మాదే’ అని చెప్పుకుంటున్నారు. చావోరేవో తేల్చుకుంటాం.. ప్రభుత్వంతో ఎంతకైనా పోరాడతామని కార్మికులు భీష్మించుకొని మొండిగా ముందుకుపోతూ విజయం కోసం వెంపర్లాడుతున్నారు. సామాన్యులు ప్రతిరోజూ ఆటోలకు, ప్రైవేట్ వాహనాలకు భారీగా ఛార్జీలు చెల్లిస్తూ అడుగడుగునా ఓడిపోతున్నారు. సమ్మెల కారణంగా అభివృద్ధి అడుగడుగునా వెనక్కిపోతున్నదనే విషయం అనేకమంది గుర్తించకపోవడం బాధాకరం. ఇందుకు మన దేశంలో అతి స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విధానాలే కారణమని అనాలో అర్థం కావడం లేదు.

-తిప్పినేని రామదాసప్ప నాయుడు