AADIVAVRAM - Others

తుఫాను తరువాత ( సండేగీత )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుఫాను తరువాత జీవితం ఉంటుందా?
ఈ ప్రశ్నకి సమాధానం అవునని, కాదని వస్తుంది. కానీ తుఫాను తరువాత ఏమీ వుండదని అనుకుంటారు చాలామంది. కానీ అది వాస్తవం కాదు. తుఫాను తరువాత కూడా జీవితం ఉంటుంది. జీవితం చిగురిస్తుంది.
గాలి, దుమారం బాగా వీచినప్పుడు చెట్లు విరిగిపోవడం, పడిపోవడం సహజం.
ఆ విధంగా పడిపోయిన చెట్లను కొమ్మల్ని నరికేస్తారు. కొన్నిసార్లు చెట్టు మొదటి భాగాన్ని అదే విధంగా వదిలేస్తారు.
ఆ విధంగా వదిలేసిన చెట్టు మొదట్లో నుంచి మెల్లిమెల్లిగా కొమ్మలు చిగురిస్తాయి. కొంతకాలానికి మరో వృక్షం అక్కడ తయారవుతుంది.
తుఫాను తరువాత జీవితం వుంటుందా? గాలి దుమారం తరువాత జీవితం చిగురిస్తుందా? అని ప్రశ్నించుకుంటే సమాధానం అవునని సమాధానం వస్తుంది.
జీవితంలోనూ అంతే!
విపత్కర పరిస్థితుల తరువాత కూడా జీవితం ఉంటుంది.
ధైర్యం కోల్పోకుండా ఉండాలి.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001