AADIVAVRAM - Others

కళ్లలో పెళ్లి పందిరి కనపడసాగె..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆల్చిప్పల్లాంటి కళ్లు.. శిల్పంలాంటి శరీరాకృతి.. అచ్చం జక్కన చెక్కిన చక్కని శిల్పంలా.. అనువైన, అరుదైన అందమైన ముఖం. ఆ ముఖాన్ని ఎంతసేపు చూసినా.. ఎంతగా అభివర్ణించినా.. తరగని అందం ఆ పిల్లది. అలా చూస్తుండిపోక కాస్త స్వతంత్రించి ఆ కన్యని సమీపించాడు ఆకర్ష్. ముఖంపై చెరగని చిరునవ్వు స్థానంలో రవ్వంత చిరాకు ప్రకటితవౌతోంది ఆమె వదనంలో. తలస్నానం చేసిందో ఏమో భృకుటి ప్రశ్నార్థకమైంది.
అయినా పట్టించుకోనట్లు తనని తాను పరిచయం చేసుకున్నాడు ఆకర్ష్. ఆమె ఇవేమీ పట్టనట్లు పక్కనున్న స్నేహితురాలు ఉషతో ఏదో ముచ్చట సాకు చేసుకు కొంచెం ఎడంగా సాగారు ఇద్దరు ఆకర్ష్ నుంచి. తను అంత తీసివేత కాదు అందంలో. ఏ మాటకా మాట చెప్పుకోవాలి తను అందగాడి కిందనే లెక్క. ఆఫీసులో అందరు తనని ప్రపోజ్ చేసేందుకు ఆసక్తి వ్యక్తపరుస్తుంటారు. కారణం మరి పాలిపోయిన తెలుపు కాకపోయినా కొంచెం ఎరుపుతో కలిసిన తెలుపు ఛాయ, కోటేరంటి ముక్కు కాకపోయినా పర్వాలేదు.. కన్ను ముక్కు తీరు, కళాకాంతులున్న ముఖం అంటుంటారు ఎరిగిన బంధువులు అమ్మా వాళ్లు.. అవునో కాదో అనుకుంటూ అద్దం ముందు సరిపోల్చుకుంటే తనకి వారన్నది సబబే అనిపిస్తుంది. నీ ఫేస్‌లో, మాటలో, నవ్వులో ఏదో ఆకర్షణ ఉన్నదిరా అంటుంటారు - ఫ్రెండ్స్ గరల్స్ అండ్ బాయ్స్.
ఇలా అంతర్మథనం తనలో సాగిపోతోంది, దానికి కాస్త బ్రేక్ వేసి మళ్లీ తనని సమీపించి కాస్త టైమెంతయిందో, చెప్తారా మిస్.. అంటూ ఆగిపోయాడు ఆమెనే చూస్తూ. ఈ హఠాత్ సంఘటనకి సంఘర్షణకి తావివ్వకుండా తన పక్కనే ఉన్న ఆమె ఇష్ట సఖి ‘సఖి రావే పోదాం.. ఇతను మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు..’ అంటూ ఆ గుస్సాయింపులో వేరు వ్యక్తం చేసినందుకు ఇష్టసఖి వైపు సఖి గుర్రుగా చూసింది. ఆకర్ష్ మటుకు అడక్కుండానే ఆమె పేరు తెలిసినందుకు మిక్కిలి సంతోష పడిపోయాడు లోలోపల. తనేమో చెవులు రెండు స్పర్శిస్తూ సఖికి కళ్లతోనే సరిచెప్పబోయింది. సఖి ఆకర్ష్ వైపు, స్నేహితురాలి వైపు కోపంగా చూస్తూ ముందు కురికింది పరుగంటి నడకతో.
కారు తారురోడ్డుపై త్రాచుపాములా దూసుకుపోతోంది.. సడెన్‌గా ఏ వివరాలు తెలుపకుండా వెళ్లిపోతున్న ఆ ఇద్దరి వైపు ఫజిల్ నింపుతున్న ముఖంతో నిల్చుండిపోయాడు ప్రశ్నార్థకంగా ఆకర్ష్. ఎంతసేపలా ఆ సముద్రతీరాన్ని.. ఎగిసిపడ్తూ కాళ్లని తాకుతున్న కెరటాల్ని చూస్తూండిపోయాడు ఆకర్ష్. కడలి కెరటాలకే ఇంత ఆరాటం.. పోరాటం పెడ్తే భగవంతుడు.. చెలియ కట్టకే ఇంత ప్రయత్నం ఉంటే.. మనిషిని నాకెంత పోరాట పటిమ ఉండాలి. నిజం.. ఉండాలి - ఎప్పటికైనా.. ఎలాగైనా - ఎంత కష్టమైనా సఖి గురించి పూర్తి వివరాలు సేకరించాలి, తనని.. తన సఖిగా చేసుకోవాలి.. ఇదే నా ప్రస్తుత టార్గెట్.
సమయం దొరికినప్పుడల్లా.. కాదు కాదు.. సమయమంత వెచ్చించి ఆకర్ష్ గుండెలో ముద్రించుకున్న సఖి రూపాన్ని, కళ్లల్లో తొణికిసలాడ్తున్న ఆమె చిరులాస్యాన్ని, అణువణువున ఆమంతించుకున్న ఆమె నామాన్ని జపించుకుంటూ కలలో మెలకువలో వైజాగ్ పట్నంలోని ఉమెన్స్ కళాశాలలు, పార్క్‌లు, బీచ్‌లు, సినిమా హాళ్లు, గుళ్లు గోపురాలు, షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద రెస్టారెంట్స్.. ఒకటేమిటి వైజాగ్ అణువణువు ఒళ్లంతా కళ్లు చేసుకు వెతుకుతున్నాడు - అది చాలా చిన్న మాట.. వైజాగ్ వైజాగ్‌ని చెరిగేస్తున్నాడు.. తపిస్తున్నాడు.. కడుపులో చెప్పలేని దిగులు.. గుండెలో కలచివేసే గుబులు.. అదే ధ్యాస, అదే శ్వాస.. ఒకవేళ తను వైజాగ్ సిటిజెన్ కాదా.. పిలిగ్రిమేజ్‌గా వచ్చిందా!! తన స్వంత ఊరికి మళ్లిందా!! ఎన్నో రకాల సందేహాలు పగలు రాత్రి మస్తిష్కాన్ని తొలిచేస్తున్నయ్.
అన్యమనస్కంగా సాగిపోతున్న ఆలోచనల్లా ఆకర్ష్ చుక్కానిలేని నావలా.. సముద్రపు ఆటుపోటుల్లా.. అయోమయంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ పై గమ్యమెరుగని గమనానికి.. దశదిశ నిర్దేశం లేని పయనం చేస్తున్నాడు ఆకర్ష్ వైజాగ్ సిటీ లిమిట్స్‌లో. ఆకర్ష్ ఆలోచనలకి బ్రేక్ పడింది.. సఖి కళ్లకి కనపడింది కనుచూపు మేరలో... కూతవేటు దూరంలో. ‘హలో.. మిస్ సఖి.. వన్‌మినిట్..’ అంటూ తన బైక్‌పై ఆమె స్కూటీకి అతి దగ్గరగా వెళ్లాడు. ఇది వరకటిలా సఖి కనుమరుగవలేదు, సిగ్నల్ ఇవ్వగానే కొంచెం ముందుకి వెళ్లి ఆగి ఆకర్ష్‌కి.. పరిచయమయిన ముఖానికి అవకాశమిచ్చింది.. గ్రీన్ సిగ్నల్‌లా.
ఇద్దరు టూ వీలర్స్‌ని పక్కగా పార్క్ చేసి వౌనంగా ఒకరిని ఒకరు పలకరించుకున్నారు కళ్లతో. ముందుగా ఆకర్ష్ ‘మిమ్మల్ని చూస్తుంటే ఎంతో పరిచయమున్న వ్యక్తిగా అనిపిస్తోంది. ఆ రోజు బీచ్ ఒడ్డున కలిసింది మొదలు ఈ కళ్లు మిమ్మల్నే అనే్వషిస్తున్నాయ్ అంటే బహుశా మీరే కాదు ఎవరూ నమ్మరు’ అంటూ తన మనోభావాల్ని సూటిగా చెప్పేశాడు.
అనూహ్యమైన అతని మనోభావాలకి కొంత చిరాకు కలిగినా సఖి అవ్యక్తంగా వాటిని దాచి, ఆకర్ష్‌ని చూస్తూ చిన్న నవ్వు పెదవులపైకొచ్చి స్పందన వ్యక్తపరచింది. అంతే.. తనిచ్చిన కాస్త చనువుని ఆసరాగా తీసుకుని.. కొన్ని మాటల్ని ఊతగా చేసుకుని భయం భయంగా ఆకర్ష్ ‘రండి సఖి.. అలా కాఫీ తాగుతూ మాట్లాడుకోవచ్చు..’ అన్నాడు ఆకర్ష్. ఆకర్ష్ స్వతంత్రించే తీరు చూస్తుంటే ఎక్స్‌ట్రా, ఓవర్ అనిపిస్తున్నా సఖి ముఖం మీద తిరస్కరించలేక పోతోంది.. అలాగని అంగీకరించ లేకపోతోంది. కారణం ఆకర్ష్ చూపుల్లో కొంత అమాయకత్వం.. ఏదో తెలియని ఆకర్షణ.. తను తనని కాదనలేక పోతోంది.
ఇద్దరూ పక్కపక్కనే నడుస్తూ పక్కనే ఉన్న వెల్‌కం హోటల్లోకి అడుగులు సాగినయ్. ‘సఖి.. మీ ఆర్డర్ ప్లీజ్..’ అంటూ మెనూ కార్డు ఆమె చేతికందించాడు, బెరుగ్గానే. కారణం ఆకర్ష్ మనసులో ఒక భయం చోటు చేసుకునుంది. తను ఆ మధ్య టీవీలో అంతస్తులు సినిమా చూశాడు. వర్తమానంలో మా ఇద్దరి స్నేహం ఏ.ఎన్.ఆర్., కృష్ణకుమారిని కాఫీకి ఆహ్వానించినట్లే ఉంది. పొరపాటున సఖి కృష్ణకుమారిలా ‘ఏయ్ మిస్టర్.. ఆడదంటే కప్పు కాఫీ కాదు. కాఫీ కప్పు కాదు’ అంటూ ముఖాన గిరాటేస్తుంది. ఆ ఆలోచనతో ఆకర్ష్ ముఖానికి పట్టిన చెమటని కర్చ్ఫీతో తుడుచుకుంటూ సఖి వైపు చూశాడు. సఖి కాఫీ ఆర్డర్ చేసింది, అంతే.. తన భయాన్ని ఈ ఆర్డర్ ఇంకాస్త బలపరచింది.
ఆకర్ష్‌లో జరుగుతున్న ఆందోళన గమనించిన సఖి ఆకర్ష్‌ని అదే అడిగింది. తీరా ఆకర్ష్ ఎంతో అమాయకంగా ఆ సీన్ చెప్పేటప్పటికి సఖి నవ్వాపుకోలేక సతమతమయి తను మామూలు స్థితికి రావటానికి కాఫీ బేరర్ తెచ్చినంత సమయం పట్టింది.. స్టార్ హోటల్స్‌లో, ఏ.సి. రెస్టారెంట్స్‌తో ఆర్డర్ చేసిన అరగంటకి గానీ పట్టుకురారు ఈవెన్ కాఫీ అయినా సరే - కాఫీ సిప్ చేస్తూ సఖి ‘్భయపడకండి.. నేను కృష్ణకుమారిని కాను, సఖిని..’ అంది ఎంతో భరోసాగా.
అలా పరిచయమయిన ఇద్దరు మంచి స్నేహితుల్లా చాలా ఫ్రీక్వెంట్‌గా కలుస్తూ ఒకరిని ఒకరు తెలుసుకున్నారు.. ఆ తరువాత ఇరు మనసులు ఒకటిగా ఒకటైనారు.. నాలుగు కళ్లు రెండైనాయి.. రెండు మనసులు ఒకటైనాయి.. సఖి ఆకర్ష్‌లు ఎంతో ఆనందంగా కాపురం చేస్తున్నారు.
ఆకర్ష్‌ని ఎప్పుడు చూస్తానా అని గడియారం వైపే చూసే సఖి కళ్లు.. ఎప్పుడెప్పుడు ఆఫీస్ ముగించుకుని సఖి ఒళ్లో వాలిపోదామా అని ఆలోచించే ఆకర్ష్.. ఇలా ఓ ఏడాది గడిచింది. ఆ రోజు వాళ్ల మ్యారేజ్ డే. ఒళ్లంతా కళ్లు చేసుకు ఎదురుచూస్తోంది సఖి. భళ్లున వాకిట్లో ఆకర్ష్ బైక్ పార్క్ చేసి లోనికి వచ్చాడు.
ఎదురుచూపులు.. ఎదలో మమతలు.. తీరా ఎదురయ్యే సమయానికి చిరాకులు.. చిరుబురులు.. విసవిసలు రుసరుసలు.. తెల్లవారే సమయానికి గుసగుసలు.. రాతిరయే సమయానికి మళ్లీ పడకటింట ఎదురుచూపులు.. పవళింత సమయానికి ఆవులింతలు.. ఏవో కవి భావనలు సాగిపోతున్నాయ్ ఇరువురి మదిలో - దినచర్యలో - పెళ్లి రోజు వేరే ఏమీ కాదుగా - అది దినచర్యలో భాగమే. ఆకర్ష్ ఫ్రెషప్పయి పడకింటికి వచ్చాడు.. మల్లెల పరిమళాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే దగ్గరగా తీసుకుని ‘సఖి.. మన తొలి కలయిక ఈ రోజు పదేపదే గుర్తుకు వచ్చింది.. నువ్వు విసవిస నన్ను తప్పించుకుని కొరకొర లాడ్తూ వెళ్లిపోయావు స్నేహితురాలితో, ఆ తరువాత చిత్రంగా.. విచిత్రంగా నాదస్వరమూదితే నాట్యమాడే నాగిణిలా నన్నల్లుకుపోయావు.. ఏమిటి నీలో ఆ పరిణామానికి కారణం..’ అంటూ ఆసక్తిగా సఖి నుంచి వచ్చే సమాధానం కోసం ఎదురుచూశాడు ఆకర్ష్.
‘ఓహ్.. అదా.. సంవత్సర కాలం పట్టిందా ఈ మట్టిబుర్రకి తట్టడానికి..’ అంది కవ్విస్తూ సఖి. ‘ప్లీజ్.. ప్లీజ్.. చెప్పు చెప్పు..’ అంటూ గోముగా చంటి పిల్లాడి మారాముగా అల్లేసుకున్నాడు సఖిని ఆకర్ష్. ‘అది చాలా పెద్ద కథ..’ అంటూ ఆకర్ష్‌లో క్యూరియాసిటీని పెంచింది సఖి సాగదీస్తూ.. కళ్లని తీగతీస్తూ ‘ఇంక నేను ఈ సస్పెన్స్‌ని భరించలేను చెప్పవా.. ప్లీజ్..’ అంటూ బుంగమూతి పెట్టేశాడు ఆకర్ష్.
‘చెప్తాను మహారాజా.. చెప్పక ఏం చేస్తాను..’ అంటూ క్లుప్తంగా గతాన్ని వర్తమానంలో కళ్లకు కట్టినట్టు చెప్తోంది సఖి. గతం కళ్ల ముందు గుండ్రాలుగా తిరుగుతోంది. ఆకర్ష్ గతంలోకి తొంగిచూస్తూ సఖి మాటలు వింటూ ‘ఊఁ!’ కొడ్తున్నాడు చంటాడిలా.
సఖిని.. సఖి స్నేహితురాలు.. ఆకర్ష్ ఫొటో ముందుంచి.. ‘ఆకర్ష్‌కి నాకు పెళ్లి చూపులు, నే ఓ.కె. చేస్తే.. నీ కభ్యంతరం లేకపోతే..’ అంటూ సఖి కళ్లల్లోకి చూసింది.. మనసులోతుల్లోకి వంగి చూసింది.. సఖి ఆ చూపులను తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా కొంచెం కోపం.. మరి కొంచెం ఇష్టం.. కనపడింది సఖి స్నేహితురాలు స్నేహకి. ఏదో తెలుగు సినిమాలో పాట ‘తెలిసిపోయే నీలో ఏదో వలపు తొంగి చూసెను’ అన్నట్లు.. ‘అలుక చూపి అటువైపు తిరిగితే అగుపడదనుకుని నవ్వేవు... అన్నట్లు స్నేహకి స్ఫురించింది. అంతే ఆ ఫొటో అక్కడే వదిలేసి స్నేహ వెళ్లిపోయింది. ఆ వెంటనే సఖి ఫొటో పట్టుకుని స్నేహని ఫాలో చేసింది. కానీ స్నేహ స్కూటినీ అప్పటికే పిలుపుకందని దూరానికి తుర్రుమంది బుర్రుపిట్టలా.
ఇది ఒకందుకు.. ఐమీన్.. సఖి పెళ్లి మాటలకి దారి తీసింది. సఖి చేతిలో ఫొటో చూసిన తల్లిదండ్రులు.. ఫొటో వెనుక ఉన్న వివరాల వైపు చూడడం.. పెళ్లిముచ్చటలకై సఖి విరిసిన సరోజంలా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అయితే ఒక కండిషన్‌పై.. ఆ కండిషన్ ఏమంటే ముందు ఆకర్ష్‌ని నేను ఫాలో చేశాక, అతని మనోభావాలు తనకు నచ్చాక, ఆనక పెళ్లి మాటలు.
ఈ ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నంతలో సఖి కళ్లలో.. (ఆనాటి) పెళ్లి పందిరి కనపడసాగే ఆకర్ష్‌కి.
అంతే ఇద్దరు పెళ్లి పందిరిలో వేడుకల్ని పంచుకున్నారు పందిళ్లలో.

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505