Others

ఎన్టీఆర్ సెంటిమెంట్.. శరత్కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళాకారులకు -ఒక చిత్రంలో నటించినందుకు రెమ్యునరేషన్ పొందిన ఆనందం కంటే.. ఆ సినిమా శతదినోత్సవ వేడుక సందర్భంలో జ్ఞాపిక అందుకునేటపుడు కలిగే ఆనందమే వేరు. ఇచ్చేది అగ్రస్థాయి నటులైతే -జ్ఞాపిక అందుకునేవాళ్ల మోముపై కదలాడే ఆనందాన్ని వీళ్లూ అనుభవిస్తారు. ఎందుకంటే -ఒకప్పుడు వీళ్లూ అలాంటి జ్ఞాపికలు అందుకున్న వాళ్లే కనుక. ఈ ఫొటో అలాంటి అనుభూతి పంచుతున్నదే. ఒకప్పటి తెలుగు సినిమా వ్యాపార రాజధాని విజయవాడలో ముఖ్యంగా దుర్గాకళామందిర్‌తో ఎన్టీఆర్‌కు ఒకింత ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే -ఆయన నటించిన చిత్రం శతదినోత్సవ వేడుకలు దుర్గాకళామందిర్‌లో నిర్వహిస్తే పాల్గొనటానికి వీలుగా ఎన్టీఆర్ తన షూటింగ్ డేట్స్ కూడా మార్చుకునేవారట. అంతేగానీ, ఏ కారణంగానూ కార్యక్రమానికి మిస్సయ్యేవారు కాదు. కారణం ఎన్టీఆర్ నట జీవితంలో మొదటి చిత్రం ‘మనదేశం’ ఇదే థియేటర్‌లో (1949 నవంబర్ 24న విడుదలై) విజయం సాధించింది. ఇదొక్కటే కాదు, ఇంకొన్ని సంఘటనలూ ఉన్నాయి.
నిజానికి -యల్‌వి ప్రసాద్ నూతన తారాగణంతో ‘శ్రీమతి’ చిత్రాన్ని నిర్మించాలని ప్రకటన ఇచ్చారు. ఆసక్తిగల నూతన నటీనటులు ఫొటోలు పంపించాలంటూ పత్రికాముఖంగా ప్రకటన చేశారు. ఇంటర్వ్యూ వేదిక విజయవాడలోని దుర్గా కళామందిరం. అక్కడ జరిగిన ఇంటర్వ్యూలో ఎన్టీ రామారావును తాను నిర్మించబోయే నూతన చిత్రం ‘శ్రీమతి’కి హీరోగా ఎంపిక చేసుకున్నారు. అయితే కారణాంతరాలవల్ల ‘శ్రీమతి’ నిర్మాణం వాయిదా పడింది. ఆ స్థానంలో ‘మనదేశం’ షూటింగ్ ప్రారంభమైంది. ‘శ్రీమతి’ చిత్రంలో హీరోగా అనుకున్న ఎన్టీఆర్‌కి ‘మనదేశం’లో ప్రాధాన్యతగల పోలీస్ ఆఫీసర్ పాత్ర ఇచ్చారు దర్శకుడు ప్రసాద్. అంతేకాదు, 50వ దశకంలో ఇదే థియేటర్‌లో విడుదలైన కొన్ని ఎన్టీఆర్ చిత్రాలు (షావుకారు- 105 రోజులు, పాతాళభైరవి -245 రోజులు, పెళ్ళిచేసిచూడు -182 రోజులు, సంఘం, మిస్సమ్మ -105 రోజులు, మాయాబజార్ -175 రోజులు) విజయవంతంగా ప్రదర్శించబడి రికార్డులు సృష్టించాయి. విజయవాడ దుర్గా కళామందిరంలో ఎన్టీఆర్ నటించిన 63 చిత్రాలు శతదినోత్సవాలు (ఇందులో తొమ్మిది రజతోత్సవాలు) జరుపుకున్నాయి. అందుకే -దుర్గా కళామందిరంతో ఎన్టీఆర్‌కు ప్రత్యేక అనుబంధం ఉండేది. తన చిత్రాల విజయోత్సవాలతోపాటు సహ నటీనటుల విజయోత్సవ వేడుకలకూ హాజరయ్యేందుకు ఎన్టీఆర్ ప్రాముఖ్యతనిచ్చేవారు. హీరో కృష్ణంరాజు నిర్మించిన ‘కృష్ణవేణి’ సినిమా శతదినోత్సవ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరై రాజబాబుకు జ్ఞాపిక బహూకరిస్తున్న ఎన్టీఆర్ చిత్రాన్ని ఇక్కడ చూడొచ్చు.

-పర్చా శరత్‌కుమార్ 9849601717