Others

ఋగ్వేదం..నూతన భాష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమారు 20 సంవత్సరాలకు పూర్వము ఆర్గోనాలిస్ అనే చిన్న గ్రంథం రచించాను. ఇపుడు 2019 జూన్ నెలలో ‘డికోడ్’ మొదలుపెట్టాను. ఇందులో ఎటువంటి స్వార్థము కాని, రాగద్వేషములు కాని లేవు.
నేను చెప్పినదే సత్యం- నేనే సర్వజ్ఞుణ్ణి అనే దురహంకారము కూడా లేదు. వేదమును డికోడ్ చేసే ఈ ప్రయత్నము మానవాళి కల్యాణము కోసమే. ఏ ప్రాచీన మత గ్రంథమైనా ప్రతీకాత్మకంగానే ఉంటుంది. ఈ మూల సూత్రం గుర్తించాలి. గ్రీకుభాషలో హోమరు రచించిన ఇలియడ్ సంస్కృతములో వాల్మీకి రచించిన రామాయణము, కావ్యయుగంలో శ్రీహర్షుడు రచించిన నైషధము ప్రతీకాత్మకములే. బైబిలులోని సోలమన్ సూర్యుడు. రామాయణంలో రాముడు సూర్యుడు. సీత భూమి. త్రిజటా స్వప్నము గాయత్రీ మంత్రము. సావిత్రి సత్యవంతుల కథకు అరవిందుడు చేసిన వ్యాఖ్యానం చదవండి. తెలుగులో గుంటూరు శేషేంద్ర శర్మ రామాయణ రహస్యములు, స్వర్ణహంస అనే రెండు గ్రంథాలు రచించారు. ఇవి ఆ గ్రంథములలోని ప్రతీకాత్మకతకు వివరణ. ఇక ప్రస్తుతాంశం- వేదములోని కొన్ని మంత్రములకు అర్థము చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఆదిభౌతిక ఆదిదైవిక ఆధ్యాత్మిక యజ్ఞాత్మక చతురర్థములు ఉన్నట్లు విద్వాంసులు లోగడ నిర్ణయించారు. కేవల శబ్దార్థం నిష్ఫలము. అందుకే ఈ ప్రయాస.
ఋగ్వేద భాష్యము..

గణేశుడు
ఋగ్వేద దైవము. ‘గణానాం త్వా గణపతి హుం హ వామహే’ అని గణేశుణ్ణి సంస్మరిస్తున్నాను. భాద్రపద శుద్ధ చతుర్థి- హస్తా నక్షత్రము- హస్తి= ఏనుగు. శమంతకమణి కథ- సింహము- జాంబవంతుడు- సత్రాజిత్తు- కుమార్తె సత్యభామ-
లియో- సింహరాశి
స్పింక్స్- నరసింహరూపము- నరసింహ దేవాలయములు - యాదాద్రి (నల్గొండ జిల్లా, తెలంగాణ), మంగళగిరి (గుంటూరు జిల్లా), సింహాచలం (విశాఖ జిల్లా).
కోమాబెరీనికస్- డెనోబోలా + రెగులస్ = సింహరాశి
మఘ - పూర్వ ఫల్గుణి (పుమ్బ- ఉత్తర ఫల్గుణి
‘గణ’- సంఖ్యనే ధాతువు.
‘గణ్యాంతే’ శ్రేష్టుడు. అగ్రగణ్యుడు - దేవుడు.
భాద్రపదం -24- 25- 26 నక్షత్రాలు - సబ్బన్ వైదిక నక్షత్ర నామం.
సింహరాశి = మఘ + పుబ్బ+1/4 ఉత్తర
భారతగాథ = ద్రౌపది- కన్యారాశి.
సమీపంలో రక్తనేత్రుడు భీముడు - వాయుదైవత్వం
స్వాతి- హనుమంతుడు కూడా.
అఘ- ఋగ్వేదనామం.
సింహరాశి - ఆల్ఫా ఈటా గామా జీటా- మాల్యా
కన్యారాశి
భూసూక్తము ‘ఓం మేదినీ నమో దేమీ వసుంధరా’’
సోలార్‌మన్ (సూర్యవంశ సంజాతుడు సాలమన్)
అస్టారత్ (అష్ట్భుజాదేవిగా భూమాతకు గుడి కట్టించాడు. శ్రీదేవి - భూదేవి విష్ణుపత్నులు.
అస్టర్= అష్టలక్ష్మి- ధనలక్ష్మి- ధాన్యలక్ష్మి మొ
ఐసిస్ (ఈజిప్టు)-
సతీ సావిత్రి కథ
ఋగ్వేందలో రోదసి- కన్యారాశి
ఏడు - మరుద్గణముల భార్య- మహాభారత కాలానికి ద్రౌపది అయింది. (పంచపత్ని) 3000 బి.సి.
ద్రౌపది అగ్నికుండ సంభూత

- ఇంకావుంది...

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్ 040-27425668