Others

పిడుగు రాముడు ఫ్లాష్‌బ్యాక్ @ 50

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళ: బి నాగరాజన్
స్టంట్స్: స్వామినాథన్
కెమెరా: ఎస్‌కె వరదరాజన్
నృత్యం: వెంపటి సత్యం
ఎడిటింగ్: జిడి జోషి
నిర్మాత: డివిఎస్ రాజు
దర్శకత్వం: బి విఠలాచార్య

సినీ రంగానికి, చిత్ర పరిశ్రమ అభివృద్ధికి వివిధ హోదాల్లో కృషిచేసి ‘పద్మశ్రీ’, ‘్భష్మ’వంటి పలు ప్రతిష్ఠాప అవార్డులు పొందిన ప్రముఖ నిర్మాత డివియస్ రాజు (దాట్ల వెంకట సూర్యనారాయణరాజు). ‘పెంకి పెళ్ళాం’, ‘మాబాబు’ వంటి పలు చిత్రాల నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించి 1964లో సొంత చిత్ర నిర్మాణ సంస్థ డివియస్ ప్రొడక్షన్స్ స్థాపించారు. తొలి చిత్రంగా ‘మంగమ్మ శపధం’ నిర్మించి విజయం సాధించారు. ఆ చిత్రానికి సముద్రాల జూనియర్ రచన, టివి రాజు సంగీతం, బి విఠలాచార్య దర్శకత్వం వహించారు. వీరి కాంబినేషన్‌లోనే డివియస్ నిర్మించి 1966 సెప్టెంబర్‌లో విడుదల చేసిన చిత్రం ‘పిడుగురాముడు’.
రాజ్యానికి ప్రభువు పేరుకి ప్రతాపరుద్రుడే కాని భీరువు(రేలంగి). అతని బావమరిది, సర్వాధికారి గజేంద్రవర్మ (రాజనాల). అనుచరులు పర్వతాలు (జగ్గారావు), పాపాలు (అల్లు రామలింగయ్య)లతో కలిసి పన్నులు వసూలు చేస్తూ ఆడపిల్లలను చెరపట్టి బాధిస్తుంటాడు. అతని అక్రమాలు ఎదిరించే సాహస యువకుడు రాముడు (ఎన్టీ రామారావు). ఓ ఆడపిల్లను విడిపించే అతని చాకచక్యాన్ని మారువేషంలో గమనించిన రాకుమారి మధుమతి (రాజశ్రీ) అతన్ని ప్రేమిస్తుంది. రాకుమారిని కలిసిన రాముడు, ఆమెతో ప్రేమలోపడతాడు. రాకుమారిని పెండ్లాడి రాజ్యం పొందాలనే దుర్భుద్ధిగల గజేంద్రవర్మ, రాము, మధుమతిల కలయికకు అడ్డంపడతాడు. ఆ దాడిలో కత్తిగాయంతో స్పృహతప్పిన రాముడును కోయ యువతి ఛాయ (యల్ విజయలక్ష్మి) కాపాడుతుంది. ఆపైన అతన్ని ప్రేమిస్తుంది. గజేంద్రవర్మతో రాకుమారి మధుమతి వివాహ నిశ్చయం కాగా, మధుమతి తప్పించుకొని వెళ్ళి రాముని కలుస్తుంది. ఇలా పలుమార్లు జరిగాక, శిలాదుర్గంలో బంధించిన మధుమతిని రక్షించేందుకు రాముడు, స్నేహితుడు శివంగి (పద్మనాభం), ఛాయ సాయంతో కోటలో ప్రవేశించి వారిని ఎదిరించి రాకుమారిని, ఛాయను వివాహం చేసుకోవటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో రాముని తల్లిగా ఋష్యేంద్రమణి, చెల్లెలిగా మణిమాల, చంపగా మీనాకుమారి, సింగిగా వాణిశ్రీ, కోయ పెద్దగా మిక్కిలినేని, రాజబాబు, ఇతర పాత్రలు పోషించారు. జానపద చిత్రాల పట్ల అభిరుచి గల నిర్మాత డివియస్, జానపద బ్రహ్మగా బిరుదుపొందిన దర్శకులు బి విఠలాచార్య రూపొందించిన ఈ చిత్రంలో దర్శకులు సన్నివేశాలను మంచి పట్టుతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. చిత్ర ప్రారంభంలో ఓ ఆడపిల్లను రక్షించటంలో హీరో సాహసం, ఆ రథాన్ని తాడుతోలాగి ఆపటం, తిరిగి ఆ రథానికి గుర్రాన్ని తప్పించి రాజనాల, జగ్గారావు, అల్లులచే తాగించి ఊరిలోకి తేవటంలాంటి సన్నివేశాలు అలరిస్తాయి. కత్తిపోటు తిన్న రాముడు గుర్రంపై పడగా వేగంగా గుర్రం పయనించి కొండమీదనుంచి మరో కొండకు దూకుతూ నదిలో పడటం, సైన్యంతో కాగడాల యుద్ధంలాంటి సన్నివేశాలు గగుర్పాటు కలిగిస్తాయి. భూత వైద్యుని వేషంలో తమాషాలు, శిలాదుర్గంలో కందకంలో పడవలో రాకుమారి తప్పించుకోవటం, మరోసారి ఫిరంగికి వేలాడే రాకుమారిని రక్షించటం, క్లోజప్ షాట్స్‌లో గుర్రపుస్వారీ, యుగళ గీతాల్లో కథానాయికా నాయకుడిని ఎంతో అందంగా చూపటం, రాజబాబు, వాణిశ్రీ, పద్మనాభంలపై హాస్య సన్నివేశాలు అలరించేలా చిత్రీకరించటం దర్శకుని ప్రతిభకు తార్కాణం. ధైర్యం, శౌర్యం, సాహసంగల యువకునిగా ఎన్టీ రామారావు సన్నివేశానుగుణమైన, భావప్రకటనాభినయంతో అలవోకగా నటించి అలరించారు. రాకుమారి మధుమతిగా రాజశ్రీ వలపు, వగపు, నిస్సహాయుడైన తండ్రిపట్ల జాలి, మేనమామ పట్ల తిరస్కారం సన్నివేశాల్లో ఆకట్టుకునేలా నటించింది. కోయ యువతిగా రాముని ప్రేమించి అది దక్కదని బాధ, అసూయ చూపటం, తరువాత త్యాగం, చివరకు అతని అర్ధాంగిగా రాకమారితోపాటు భాగం పంచుకోవటంలో ఆనందం, ఒప్పించే నటనతో వాణిశ్రీ మెప్పించింది.
కనువిందు చేసే వెనె్నల, పూల తోటలు, అడవిలో హీరో హీరోయిన్లపై ఛాయపడటం లాంటి సన్నివేశాల్లో ఫొటోగ్రఫీ గొప్పతనం కనిపిస్తుంది. రామునిపై చిత్రీకరించిన యుగళ గీతాలు, నృత్య గీతాలు ఒకదానివెంట మరొకటిగా మధ్యలో ఓ సన్నివేశంతో వస్తూ చిత్రం మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. రాజశ్రీ, ఎన్టీఆర్‌పై -ఈ రేరుూ నీవూ నేనూ/ ఎలాగైనా కలవాలి, -పిలిచిన పలుకవు ఓ జవరాలా, -చల్లగ విసిరే నీ చిరునవ్వులు/ మధువులు చిలికెను నాలోనా, -మనసే వెనె్నలగా మారెను లోలోన పాటలు ఆణిముత్యాలే. అంతఃపురంలో నాయికా నాయకులపై, తరువాత రాజనాలతో వెనక ఎన్టీఆర్ అభినయంతో తమాషాగా చిత్రీకరించిన గీతం -చినదానా ఓ చిలిపి కనుల. ఆడవేషంలో ఎన్టీఆర్, పద్మనాభం, రాజనాల బృందంపై చిత్రీకరించిన గీతం -రంగులు, రంగులు రంగులు (పి సుశీల, ఎల్‌ఆర్ ఈశ్వరి). సుశీల, ఘంటసాలల గానంతో యల్ విజయలక్ష్మి, ఎన్టీఆర్‌లపై చిత్రీకరించిన గీతాలు -మిలమిల మెరిసే మనసే ఎగిసి దూకిందిలేలో, -కానరాని ఆకాశ దీపం గుండెలోన కొలువైన సామి పండు వెనె్నల కురిపించిలే, మరో గీతం ఎన్టీఆర్ నడకకు, ఆకారానికి తగ్గట్టు -నడకలో కొదమసింగపు అడుగులు/ మేనిలో పసిడి వనె్నల మెరుపులు/ రారా కౌగిలి చేర రారా దొరా (పి సుశీల- సి నారాయణరెడ్డి) వీర, శృంగార, రసానుభూతికి, రచనా చమత్కృతికి అద్దంపట్టేలా, రసజ్ఞ హృదయాలను అలరిస్తూ సాగుతుంది. ఈ చిత్రం మ్యూజికల్ హిట్‌గా నిలవడమే కాదు, నేటికీ ఆ అలరింపు కొనసాగటం విశేషం. ఈ చిత్రంలో మరో రెండు గీతాలు కొసరాజు రాశారు. ఒకటి.. పద్మనాభం, వాణిశ్రీలపై ‘నిండు అమాసానిసిరేతిరి (ఎల్‌ఆర్ ఈశ్వరి, మాధవపెద్ది), రెండోది.. యల్ విజయలక్ష్మిపై కొమ్మల్లో పాలపిట్ట (సుశీల).
పది వారాలకు పైగా ప్రదర్శితమైన ‘పిడుగురాముడు’ అప్పట్లో మంచి విజయమే సాధించింది. డివియస్ ప్రొడక్షన్స్ ఆ తరువాత పలు జనరంజకమైన చిత్రాలు నిర్మించటం, వాటిల్లో సింహభాగం ఎన్టీఆర్ కథానాయకునిగా నటించటాన్ని గమనిస్తే -డివియస్ రాజుకి, ఎన్టీఆర్‌కు ఉన్న అనుబంధం ద్యోతకమవుతుంది.

-సివిఆర్ మాణిక్యేశ్వరి