Others
నవ భారతం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 23 October 2019
- అరుణ కీర్తిపతాక, 9390109311

నల్లధనమే ఇరుసుగా ఇంధన వనరై
రాజకీయ రథాలు రాజ్యమేలుతున్న వేళ
ఆ అవినీతి చెద పురుగులు లేనిది ఎక్కడ?
సచ్చరిత్రులను ఎంచడం అంటే
గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరే
వృథా ప్రయాసే కదా నేడు!?
కాసు రాజకీయాలకు పునాదులు పడి
ప్రజాధన కైంకర్యం చేసేందుకు
ఊడలు దిరిగి ధనస్వామ్యం
అనామిక బాండ్ల గర్భాలు మోస్తూ
అవినీతి కవలలను ప్రసవిస్తుంటే
ప్రజాస్వామ్య తరువులను
అవినీతి చెదపురుగులు
మొదలంటా తొలుస్తూ
నీతిని కుప్పకూలుస్తుంటే
శీలవర్తన పారదర్శకత విజ్ఞత రాజకీయం విలసిల్లీ
నల్లధన చెదపురుగులపై ఉక్కుపాదం మోపే శుభతరుణం ఇదే...