Others

కలర్‌ఫుల్‌గా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంజిఆర్ మళ్లీ వస్తున్నాడట..!
తమిళుల అభిమాన నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ నటించిన ‘రిక్షాకారన్’ విజయవంతమైనది. 1971లో రాష్టమ్రంతటా విడుదలైన ఈ చిత్రం విజయఢంకా మోగించింది. ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీత సారధ్యంలో వచ్చిన ప్రతి పాట ఆణిముత్యమే. మంజుల, పద్మిని కథానాయికలుగా రూపొందిన ఈ చిత్రంలో సుప్రసిద్ధ విమర్శకుడు చో.రామస్వామి నటించడం విశేషం. తెలుగులో మాయాబజార్ రంగులలో మరలా విడుదలై ప్రేక్షకులకు ఆనందాన్ని ఇచ్చినట్టుగానే ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ రంగులతో ముస్తాబవుతోంది. ఎంజిఆర్ వీరాభిమాని ఒకరు ఈ బృహత్తర కార్యక్రమాన్ని తలకెత్తుకోవడం విశేషం.

-కెఎస్, చెన్నయ్