Others

వానకాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంత కసాయగుండె ఆకాశానిది
నీటి కత్తితో గొంతు కోసింది
వింతదాహం వాన చినుకులది
తడి నెగళ్లతో మంట పెట్టింది
చెలకల్లో పిలకల గిలకనవ్వు
వరికంకులై పూయక మునుపే
కొంగలు వాలిన చేను చేసింది

నవజాత శిశువు లేలేత చేతుల్లాంటి
రెండాకుల నమస్కారాలతో పొలమంతా
ఆకలిని తుదముట్టించే ఆహార హస్తమై
పచ్చపచ్చగా పైపైకి కదులుతున్నప్పుడు
సవ్వడి లేని జడిగా దడికట్టి
చినుకుల సైన్యాన్ని చేలంతా దింపింది
రాత్రనక పగలనకా కురుస్తూ కరుస్తూ
వాన దరువుతో ఎండ కరువు సృష్టిస్తూ
పూరిగుడిసెల పైన పిడుగు గుద్దులతో
రహదారుల్ని కోస్తూ, వంతెనల్ని మింగేస్తూ
జనావాసాల పైన శవాసనాలు వేస్తూ
మనిషి కంట కన్నీటి పూట తవ్వింది

మనిషికి మట్టికి మధ్య బంధం తుంచేసి
మనసు - మమతల్ని జలసమాధి చేసి
కొండాకోనలు నామరూపాలు తుడిచేసి
నేలకీ గగనానికీ మధ్య వాన వంతెన కట్టేసి
గుడినీ, గుడిలో లింగాన్ని మింగేసింది
వరద పడగ విప్పి వూరిని కాటేసింది

- ఈతకోట సుబ్బారావు, 9440529785