AADIVAVRAM - Others

ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ ప్రేమా..
నన్ను అందుకోవాలని ఆరాటపడ్డాను
పొదివి పట్టుకోవాలని ఉబలాటపడ్డాను
నాలో నన్ను నిలుపుకోవాలని కలలు కన్నాను
ఆ కలలన్నీ కల్లలే అయ్యాయి
అందినట్లే అందుతావ్
అంతలోనే చేజారిపోతావ్
దూరాన ఉంటూ ఊరిస్తావ్
కవ్వించి నన్ను ఉరికిస్తావ్
ఈ పరుగులో నేను అలసిపోయాను
ఈ పోరాటంలో నేను ఓడిపోయాను
అలసి సొలసి చెమ్మగిల్లిన కళ్లతో
నినే్న చూస్తున్నా...
దయ తలచి నా దరికి చేరతావని
కనులు మూతలు పడేలోపు
కట్టెకాలి బూడిద అయ్యేలోపు
కరుణించి నన్ను కనికరిస్తావా?

-సౌజన్య 98499 82776