AADIVAVRAM - Others
నిర్వికార దీపావళి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 27 October 2019
-రామడుగు వేంకటేశ్వర శర్మ 9866944287
తే.గీ. నవ్యమైన విశ్వ ప్రాంగణంబు నందు
ప్రథిత పరమాత్మ కట్టు తోరణములెన్నొ;
ఘనత నాత్మల మణి దీపికలు సతమ్ము
అందు ఆనంద రూప నృత్యమ్మొనర్చు;
అట్టి పర్వదినమ్మె దీపావళియన॥
తే.గీ. వర్ణములలోన ‘దీ’ అను వర్ణము గన
ప్రమిదలో వెల్గు దీపరూపమ్మె తోచు;
ఎడద ప్రమిదలోన తలెత్తి అడరు దివ్వె
అనియెడి శిరస్సుగలవాడె అసలు మనిషి
అక్షరాకారమైన దీపావళి అదె॥
తే.గీ. కలికి తోడ్పాటులేక మగండెవండు
ధర్మయశమొందడనుచు సత్యాప్రియు కథ
పలికె నరక చతుర్దశీ పర్వవేళ;
ఎట్టివాడవైన నహంకరింతువేని
ఫలము బలిగతే అని చాటు పర్వవౌర!
నిర్వికారవౌ దీప సందేశమిదియె॥