Others

‘ధర్మం సెయ్ దొరా! కుంటోణ్ని?!’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది దొరల మహానగరం లండన్. అందులో సెంట్రల్ స్ట్రీట్.. రద్దీ సమయం. హైదరాబాద్ వాసులందరికీ అనుభవంలో వున్న దృశ్యం. దీనంగా, అక్కడ ప్రత్యక్షమైంది. ఖరీదైన కార్లు- రెడ్ ట్రాఫిక్ సిగ్నల్‌మీద ఓ కన్ను వేసుండగా- అతి దీనాతిదీనుడయిన ఒక కుంటివాడు- ‘సంక కర్ర’ పట్టుకుని ఒంటికాలిమీద కుంటుకుంటూ- ‘‘్ధర్మం సెయ్ దొరా! అవిటివాణ్ని’’ అంటూ చెయ్యి జాపుతూంటే, అమ్మలూ, బాబులూ కరిగి మంచుబొమ్మలయిపోయి- ‘‘పాపం! అవిటోడు’’ అనుకుంటూ కాసులు తీసి పడేసి- కార్లు ముందుకి దూకించేసుకున్నారు.
‘‘దేవుడు ఎంత దుష్టుడు’’ అనిపించే రుూ హృదయ విదారక దృశ్యం కాస్సేపట్లో మారిపోయింది.
తన చేతనున్న ‘క్రచ్’ (కర్రసాయం)ని గిర్రున తిప్పి గిరవాటేశాడు ఆ దీనుడు. మరో నేస్తం దాన్ని- స్లిప్స్ ఫీల్డర్‌లాగా ‘క్యాచ్’ చేశాడు. వీడు కాసులు లెక్కపెట్టుకుంటే 15 పౌండ్లున్నాయి. ఈల వేసుకుంటూ పోయి కూల్‌డ్రింకు, చైనాఫుడ్డూ కొనుక్కుని, జల్సాగా వస్తున్న వాణ్ని చూసి, ఎవరేనా అవాక్కయిపోతారు. మహానటనకు ఇండియన్ బెగ్గర్స్‌ని మించిపోయిన వీడు - పత్రికా విలేఖరులకు తన దేశం, భాష, జాతి చెప్పను పొమ్మన్నాడు. ఫొటోలు దిగాడు ధైర్యంగా.
బల్గేరియా నుంచి వచ్చిన ముష్టిగ్యాంగులో వీడు ఒక భాగమని అనుకుంటున్నారు. మదర్ ఇండియా రుూ విషయంలో కూడా ఇతర దేశ బెగ్గర్స్‌కి ఆదర్శమేన్నమాట!