Others

జీవ వైవిధ్యం - అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ అనంతమైన విశ్వంలో కోటానుకోట్ల నక్షత్రాలు అందులో సూర్యుడు ఓ నక్షత్రం. దానిచుట్టూ తొమ్మిది గ్రహాలలో మన భూమి ఒకటి. ఇప్పటివరకు భూమిమీద తప్ప ఇతర గ్రహాలలో జీవం ఉన్నట్లు స్పష్టమైన సమాచారం లేదు.
దాదాపు 2000 మిలియన్‌ల సంవత్సరాలకు పూర్వం భూమిపై జీవకణాలు ఏర్పడ్డాయి. మొదట ఏకకణ జీవులు ఏర్పడినాయి. తరువాత బహుకణ జీవులు ఏర్పడ్డాయి. వాటి నుంచి క్రమంగా జరిగిన మార్పులవల్ల వివిధ జీవజాతులు ఏర్పడ్డాయి. భూమిపైన అనేక రకాల జీవజాతులు ఉండటాన్ని జీవవైవిధ్యం అనవచ్చు. జీవ వైవిధ్యాన్ని ఆంగ్లంలో ‘బయలాజికల్ డైవర్శిటీ’ అంటారు. ఈ పదాన్ని తొలిసారిగా ప్రఖ్యాత శాస్తవ్రేత్త రేమండ్ దస్మాన్ 1968లో ‘ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కౌంటీ’ అనే తన పుస్తకంలో ఉపయోగించాడు. తరువాత 1986లో డబ్ల్యు.జి.రోసన్ బయలాజికల్ డైవర్శిటీని ‘బయో డైవర్శిటీ’గా మార్చాడు.
ప్రస్తుతం భూమిపై 5నుండి 30 మిలియన్‌ల జీవ జాతులు ఉన్నట్లు అంచనా. అందులో ఇప్పటివరకు 1.75 మిలియన్‌ల జాతులను గుర్తించారు.
గుర్తించిన జాతులు:
బాక్టీరియా 4,000 రకాలు
ప్రోటోజొవాలు 80,000 రకాలు
అకసేరుక జంతువులు 1,272,000 రకాలు
సకసేరుక జంతువులు 52,000 రకాలు
శిలీంద్రాలు 72,000 రకాలు
వృక్షాలు 270,000 రకాలు
భూమిపై ఉన్న కోట్లాది జీవజాతులలో మూడింట రెండువంతులు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రతి 20 నిమిషాలకు ఒక జీవజాతి కనుమరుగు అవుతున్నది. ప్రతి ఏటా దాదాపు 1% జీవజాతులు నశించిపోతున్నాయి. పర్యావరణంయొక్క ఆరోగ్య సూచీలుగా ఉండే కప్పల వంటి ఉభయ చరాలు 41% నశించిపోయే దశలో ఉన్నాయి. ఇలా నశించిపోయే దశకు చేరిన జీవజాతులను ఐయుసిఎన్ అనే ఒక అంతర్జాతీయ సంస్థ ‘రెడ్ డేటా లిస్ట్’లో నమోదుచేస్తుంది. ఈ జాబితాలో నమోదయ్యే జీవజాతుల సంఖ్య రోజురోజుకు పెరగడం సమస్య తీవ్రతను సూచిస్తుంది. ఐయుసిఎన్ ప్రకటించిన ‘రెడ్ డేటా లిస్ట్’లో దాదాపు 41,415 జాతుల జంతువులు, వృక్షాలు ఉన్నాయి. వీటిని సంరక్షించకపోతే త్వరలో నశించిపోతాయి. ఈ జాబితాలో 16,306 రకాల జాతులు అత్యంత ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తుంది. అత్యంత ప్రమాదాన్ని ఎదుర్కొనే జంతువులుగా పులి, ఆసియా ఏనుగు, పాండా, నీలి తిమింగలం, గొరిల్లా వంటివి ఉన్నాయి. అకాలిఫా, టెక్సాస్ వైల్డ్ రైస్ వంటి చెట్లుకూడా అతి తొందరలో కనుమరుగయ్యే అవకాశం ఉంది. నశించిపోయే దశలో ఉన్న జీవజాతులు ఎక్కువగా ఉన్న దేశాలలో ఈక్వెడార్ (2,301 జాతులు) ప్రథమ స్థానంలోనూ, అమెరికా, మలేషియా వంటి దేశాలు ద్వితీయ, తృతీయ స్థానాలలోనూ ఉన్నాయి. ఇలాంటి జీవజాతులు కలిగిన మొదటి పది దేశాల జాబితాలో మన దేశం కూడా ఉన్నది. పర్యావరణ నిపుణులు చెప్పే ప్రకారం సెల్‌ఫోన్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా పిచ్చుకల రోగ నిరోధక వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. అందవల్ల వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నది. సహజసిద్ధమైన పారిశుద్ధ్య జీవులు (నేచురల్ స్కావెంజర్స్) రాబందులు గత దశాబ్ది కాలంలో 97% వరకు అంతరించిపోయాయి.
జీవ వైవిధ్యం తగ్గిపోవడానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ప్రధాన కారణం మానవుడే! భూమిపై ఉన్న ప్రతి జీవజాతి మానవునికంటె ముందు ఏర్పడినదే. మానవుడు తన స్వార్థంతో అత్యాశతో ఇతర అన్ని జీవులమీద తన ఆధిపత్యాన్ని సాధించాడు.
అడవులను నరికివేయడం, అటవీ భూములను సాగుభూములుగా మార్చివేయడం, అడవులలో రోడ్లు, వంతెనలు నిర్మించడం వంటి చర్యలవల్ల జీవజాతుల సహజ ఆవాసాలు దెబ్బతింటున్నాయి. చర్మం, మాంసం, దంతాలు వంటి వాటి కోసం జంతువులను విపరీతంగా వేటాడుతున్నారు. ప్రస్తుతం సముద్ర చేపలను పట్టడానికి సౌరశక్తి ఆధారిత నౌకలను వినియోగిస్తున్నారు. వీటికి అనుసంధానిస్తున్న వలల విస్తీర్ణంలో దాదాపు 10 జంబో విమానాలను పెట్టవచ్చునంటే అవి ఎంత పెద్దవో ఊహించవచ్చు. ఈ విధంగా కొద్దికాలంలో ప్రకృతిని వెలికితీసి భవిష్యత్తు తరాలకు అవి లభించే అవకాశం లేకుండా చేస్తున్నారు. విదేశీ జాతులను స్థానిక ఆవాసాలలో ప్రవేశపెట్టినపుడు అవి స్థానిక జాతుల వినాశనానికి కారణమవుతున్నాయి. మొక్కలు పరాగ సంపర్కకారులైన కీటకాలలో ఒకటి నశిస్తే మరొకటి నశిస్తుంది.
ప్రకృతికి సహజసిద్ధంగా ఉన్న జీవవైవిధ్యం ఎంతో అవసరం. ఈ చరాచర సృష్టిలో జీవజాతుల మధ్య ఉన్న సంబంధాల మధ్య మనిషి ఒక సూక్ష్మభాగం మాత్రమే! సున్నితమైన ఈ ఆహారపు గొలుసు దెబ్బతింటే మానవ మనుగడకే ప్రమాదం. జీవజాతులు నశించిపోవడం మన ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చుచున్నది. ఎందుకంటే ఈ భూమిమీద ఉన్న ప్రతి ప్రాణి ఏదోఒక ప్రాధాన్యతను కలిగిఉంది. ఇందులో ఏ జీవజాతి కనుమరుగైనా ఆహారపు గొలుసు దెబ్బతింటుంది. ఇది అనేక ఇతర జాతుల వినాశనానికి దారితీస్తుంది.
1983లో భారతదేశం నుంచి ‘అమెరికా, ఫ్రాన్స్ మరియు ఇతర యూరోపియన్ దేశాలకు 3,650 టన్నుల కప్పలు ఎగుమతి అయ్యాయి. కప్పలను అంత పెద్దమొత్తంలో సేకరించడం వల్ల వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దాంతో కప్పలను తినే కీటకాలు, చీడ పురుగుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోయిందని శాస్తవ్రేత్తలు గుర్తించారు. వీటివల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోయింది. పరిస్థితిని తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం కప్పల ఎగుమతిని నిషేధిస్తూ 1987న చట్టం తేవలసి వచ్చింది.
1958లో చైనా పాలకుడైనా మావోజెడంగ్ ప్రజల శ్రమ ఫలితమైన గింజల్ని దోచుకుతింటున్న పిచ్చుకల్ని నాశనం చేయమని ఆదేశించాడు. జనాలు తప్పట్లు, గినె్నలు మోగించారు. పాపం ఆ పిచ్చుకలు శబ్దాల హోరుకు తట్టుకోలేక రెక్కలార్చుకుంటూ నేలకొరిగాయి. సమస్య సద్దుమణిగిందని అనుకున్న రెండేళ్ళ తరువాత కొత్త సమస్య మిడతలరూపంలో వచ్చిపడింది. పంట పొలాలపై మిడతలు దండయాత్ర చేసాయి. గింజలు కాదుకదా అసలు పంటే లేకుండాపోయింది. చైనా చరిత్రలో అతిపెద్ద కరువు ఏర్పడినది. ఏకంగా 3 కోట్ల మందిని బలి తీసుకున్నది. పొలాల్లో చీడపురుగుల్ని ఆహారంగా తీసుకుంటూ రైతులకు మేలుచేస్తున్న పిచ్చుకలను చంపడం ఎంత తప్పో గుర్తించిన చైనా పాలకులు పిచ్చుకల సంరక్షణకు చర్యలు చేపట్టారు.
అడవిలో ఉండే పులి, కుందేళ్ళు, నక్కలు, జింకలు వంటి అనేక జంతువులను వేటాడి ఆహారంగా గ్రహిస్తుంది. పులే లేకపోతే అడవిలో జంతువుల సంఖ్య పెరిగి, వాటి ఆహారపు అవసరాలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. దీనివల్ల అడవిలోని గడ్డి, చెట్లు, కాయలు, పండ్లు వీటికి ఆహారమవుతాయి. అందువల్ల వాటిని ఆశ్రయించి ఉండే క్రిమికీటకాలు, సూక్ష్మజీవులు నశిస్తాయి. అడవిలోని జంతువులు, పక్షులు, కీటకాలు పంట పొలాలపై పడితే గనుక మనకు తిండి కూడా దొరకని స్థితి ఏర్పడుతుంది.
మానవుడు ప్రకృతిలో ఓ భాగం. కానీ తాను ప్రకృతికి అతీతమైన వ్యక్తిగా భావిస్తున్నాడు. భూమిపైనున్న జీవులను కాపాడమని ప్రకృతి మనిషికి మిగిలిన ఏ జీవికి లేనన్ని తెలివితేటల్ని ఇచ్చింది. కానీ మనిషి తన తెలివిని అతితెలివిగా మార్చి ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. అందుకే ప్రకృతి భూకంపాలు, కరువుకాటకాలు, వరదలు, సునామీలు వంటి రూపంలో తన ఉగ్రరూపాన్ని చూపుతూ జాగ్రత్తపడమని హెచ్చరిస్తున్నది.
తేనెటీగలు దాదాపు లక్షాముప్పైవేల రకాల మొక్కలలో పరాగ సంపర్కానికి కారణమవుతాయని కనుగొన్నారు. తేనెటీగలు నశించిపోతే చెట్లలో పరాగ సంపర్కం ఆగిపోయి, జీవవైవిధ్యం నాశనమవుతుంది. ప్రసిద్ధ శాస్తవ్రేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చెప్పినట్లుగా.. ‘‘తేనెటీగలు భూమిమీద నశించిపోతే, మానవ జాతి నాలుగేళ్లలో నశించిపోతుంది.’’!
జీవ వైవిధ్యాన్ని పెంచడం కోసం బయోడైవర్శిటీ హాట్‌స్పాట్‌లు, బయోస్పియర్ రిజర్వ్, జాతీయ పార్కులు, అభయారణ్యాలు వంటి వాటిని ప్రభుత్వాలు ఏర్పాటుచేసాయి. అంతర్జాతీయ సంస్థలైన ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్‌సర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్స్ ఐయుసిఎన్ మరియు డబ్ల్యుడబ్ల్యుఎఫ్ (వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫైండ్) కూడా జీవ వైవిధ్యాన్ని పంచడానికి కృషిచేస్తున్నాయి. 2012 సంవత్సరం హైదరాబాద్ నగరంలో జరిగిన జీవవైవిధ్య సదస్సు ఒక థీమ్‌ని ప్రతిపాదించింది. అదేమిటంటే - నేచర్ ప్రొటెక్ట్స్, ఇఫ్ షీ ఈజ్ ప్రొటెక్టడ్. ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది’’. ఈ వ్యాఖ్య అక్షరసత్యం మరియు అనుసరణీయము.

- పి.మురళీకృష్ణ, 9491312002