Others

జ్ఞాపకశక్తి తగ్గిపోతోంది!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెల్‌ఫోన్ వాడకంతో పిల్లల్లో మానసిక సామర్థ్యం కొరవడుతోంది. సెల్‌ఫోన్ నుండి వచ్చే రేడియో ధార్మిక కిరణాల నుండి పిల్లల బ్రెయిన్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. పిల్లల్లో సృజనాత్మక శక్తి, ఆలోచనాశక్తి, తెలివితేటలు, మెమరీ మందగిస్తున్నాయి. ఏకాగ్రత సన్నగిల్లుతోంది. ఆత్మవిశ్వాసం లోపించడంతోపాటుగా, కోపం, మానసిక ఒత్తిడి, ఆందోళనలు పెరిగే అవకాశం ఉంటుంది. సెల్‌ఫోన్లలో వివిధ రకాలైన గేమ్స్ అందుబాటులోకి రావడంతో ఆ గేమ్స్‌లో మునిగిపోయిన పిల్లలు పక్కనున్న ఎవరినీ పట్టించుకోని స్థితిలో ఒంటరితనానికి అలవాటుపడి మానవ సంబంధాలకు దూరంగా, తల్లిదండ్రుల ఆత్మీయ స్పర్శకు నోచుకోలేక పెరుగుతారు. మొదటగా ఎంతో చిన్నవిగా కనిపించే సమస్యలని సరైన సమయంలో పట్టించుకుని సరైన పరిష్కారాలు వెతకకపోతే అవే పెద్దవిగా మారి పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.
ఒకప్పుడు మతిమరుపు అనేది తాతలు, అమ్మమ్మలు, బామ్మలు, నానమ్మలు, వృద్ధులలో కనబడేది. కాని ఇది ప్రస్తుతం అందరినీ వేధిస్తున్న సమస్య. విద్యార్థులకు పరీక్షలలో ప్రశ్నలకు జవాబులు గుర్తుకు రాక వేదనకు గురయ్యేవారెందరో. వాస్తవానికి గత దశాబ్దకాలం నుంచి గమనిస్తే మనం మెదడును పూర్తిస్థాయిలో వాడుకోవడం లేదనే చెప్పాలి. ప్రతి అవసరానికి ఏదో ఒక సాధనం మీద ఆధారపడుతూ మెదడు వాడకాన్ని పూర్తిగా తగ్గించేశాం.
మెదడును చలాకీగా పనిచేయించుకోవడం మన చేతుల్లోనే వుంది. ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఇవి జ్ఞాపకశక్తిని మెరుగుపరచుకోవడానికి దోహదం చేస్తాయి. మెదడు సమర్థవంతంగా పనిచేయాలంటే ధ్యానం, యోగా, పోషక విలువలు గల ఆహారం, శారీరక మరియు మానసిక వ్యాయామాలు ఎంతో దోహదం చేస్తాయి. పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే, ముందుగా పిల్లల్లో వారి జ్ఞాపశక్తిపై వారికి నమ్మకం, పాజిటివ్ దృక్పథం ఉండాలి. ఇంట్లో పరిస్థితులు కూడా అనుకూలంగా చక్కదిద్దుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. జ్ఞాపశక్తిని పెంచుకునేందుకు మీకు అర్థమయ్యే, సులభమైన పాఠ్యాంశాలకు ప్రాధాన్యతను ఇవ్వాలి. పాఠ్యాంశాలు చదివేటపుడు ఒక లింకు పద్ధతి (కొండగుర్తులు) ద్వారా పాఠాలను చదువుతూ గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులుంటాయి అని అంటే విఐబిజివైఒఆర్. ఇదేరకంగా ఫార్ములాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్ భాషలో పదాలను గుర్తుపెట్టుకోవడం లాంటివి చేయడంవల్ల కూడా జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
వివిధ చిత్రాల, రేఖాపటాల ద్వారా అనేక విషయాలను గుర్తుంచుకోవటం. పదం లేక వాక్యాల తాలూకు బొమ్మను మనసులో ఉంచుకుని జ్ఞాపకం తెచ్చుకునే ప్రయత్నం చేయటం లాంటివి చేయాలి. ఏ విషయాలను గుర్తుంచుకోవాలని అనుకుంటున్నారో, ఆ పదాలను ఒక అర్థవంతమైన వాక్యంగా తయారుచేసి జ్ఞాపకం ఉంచుకోవాలి.
ఆటల ద్వారా కూడా రకరకాల విషయాలను జ్ఞాపకం ఉంచుకునే ప్రయత్నం చేయాలి. కథలరూపంలో పేర్చుకుని గుర్తుపెట్టుకోవడం, పంచేంద్రియాల ద్వారా, హాస్యం ద్వారా జ్ఞాపశక్తిని పెంచుకునేలా ప్రయత్నించాలి. అర్థం చేసుకుని చదవడం అనేది ఒక మంచి టెక్నిక్. ఇలా అర్థం చేసుకుని చదవడంవల్ల విషయాలు సులభంగా జ్ఞప్తికి వస్తాయి. ఒక విషయం గురించి చిన్న చిన్న కాగితాలపై సంక్షిప్తంగా రాయడం ద్వారా కూడా జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
ప్రతిదీ చేయలేం కానీ ప్రయత్నిస్తే కష్టంగా అనిపించే వాటిని సులభంగా మార్చుకోవచ్చు.

-డా అట్ల శ్రీనివాస్‌రెడ్డి