Others
అరటిపండు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అరటిపండు ఒలిచినట్టే ఉంటుంది
ఒక్క కన్నీటి వెతను
కథలు కథలుగా తెరవిప్పి చెబుతున్నప్పుడు
కంటినుండి జారి ప్రతి కన్నీటి బిందువు
జ్వలించి లావాగా మారుతూ
గుండె కరిగిన చిత్రాన్ని జీవితం కేన్వాస్‌పైన
కష్టాల రంగులో చిరునవ్వుల మెరుగు కలిపి
నిత్య జీవన చిత్రాన్ని గీస్తున్నప్పుడు
భూమీద మనిషికి మాత్రమే కాదు
అడవిలో మానుకు సైతం ఉంటాయ బాధలు
ఎండల్లో ఎండుతూ నీటిచుక్క కోసం
ఆకుల్నే ఆధారాలుగా దాచి
ఆకాశం కేసి చూస్తున్న
మాను లాంటివే నీడలేని కన్నీటి మనుషుల వెతలు
ఆత్మాభిమానం ఆయువుకు తగ్గ ఆభరణంగా
ధరించి నష్టపోయన పంటను
ఎదిగిన బిడ్డను కోల్పోయన తండ్రిలా భరించి
రుణం తీర్చలేని బాధను
మరణం వైపు మళ్ళించి
రణం సాగిస్తూ కొమ్మకు ఉరేసుకున్న రైతు కథను
కళ్లకు కనిపించేట్టు వర్ణిస్తున్నప్పుడు
అరటిపండు ఒలిచినట్టే ఉంటుంది
గుండెల నుండి చుక్క చుక్కా రక్తాన్ని
ఊపిరి తీస్తున్నప్పుడల్లా
కొంచెం కొంచెం ప్రాణాన్ని
నవమాసాలు పంచిపెట్టిన అమ్మ మనసు
అద్దె గర్భం కాచిన కాయను అప్పగిస్తున్నప్పుడు
తల్లి గర్భశోకాన్ని కవిబ్రహ్మ కాదు కదా
విశ్వ విధాత చతుర్ముఖ బ్రహ్మ కూడా వర్ణించలేడు
అయనా కవి సమయం
కన్నీటి సిరాతో స్ర్తీలపై సాగే కీచకపర్వాన్ని
కళ్లకు కట్టినట్టు కనుగంతలు విప్పుతున్నప్పుడు
అరటిపండు వొలిచినట్టే ఉంటుంది
కాలం చండ్రనిప్పులు కురిసినట్టూ ఉంటుంది