AADIVAVRAM - Others

మంచి మనసు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనగనగా ఒక గ్రామంలో రామశర్మ అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చాలా ఉతముడు. అతని భార్య వసుమతి. భర్తకు తగ్గ భార్య. రామశర్మ ఆ ఊరి చివర్లో ఉన్న అమ్మవారి గుడిలో పూజారిగా పనిచేసేవాడు. ఆ దారిని పోయే భక్తులు ఇచ్చే దక్షిణతో దేవునికి నైవేద్యాలు పెట్టి వాటిని భక్తులకు పంచగా మిగిలినది తనూ, భార్యా తిని కడుపు నింపుకునేవారు.
ఒకరోజు భక్తులెవరూ అమ్మవారి దర్శనానికి ఆ గుడికి రాలేదు. మర్నాడు ఉదయం పూజలు నిర్వహించి మంచి నీళ్లనే అమ్మవారికి నైవేద్యంగా పెట్టి...
‘అమ్మా..! ఈ రోజు నీకు మంచినీళ్లే నైవేద్యం పెడుతున్నాము తల్లీ. మమ్ములను మన్నించు’ అని బాధపడ్డారు.
అయితే ఆ గుడికి దగ్గరలో చెట్ల పొదల్లో దాక్కున్న దొంగ ఈ మాటలు విన్నాడు. అతను ముందు రోజు రాత్రి ఆ గ్రామంలో దొంగతనం చేసి గ్రామస్థులు తరుముతుంటే వచ్చి ఆ పొదల్లో దాక్కున్నాడు. అతనికి రామశర్మ దంపతుల మాటలు చాలా ఆసక్తి కలిగించాయి. దాంతో వాళ్లేం తిని బతుకుతారో గమనించాలనుకుని ఆ పొదల్లో అలాగే నక్కి కూర్చున్నాడు.
మధ్యాహ్నం గుడి మూసేశాక.. భార్య వసుమతి భర్తతో అంది.
‘ఏనాడూ ఇలా అమ్మవారిని పస్తు పెట్టలేదు. మంచినీళ్లు నైవేద్యంగా పెట్టాము. అవి ఎంతసేపు ఆకలిని నిలువరిస్తాయి. ఇలా ఇక ముందు ఎప్పుడూ జరగకుండా నాకు ఒక ఆలోచన వచ్చింది. అమ్మవారికి పూజ చేసిన ఈ అడవి పూలని గ్రామం పట్టుకెళ్లి అమ్ముకుని వస్తాను. అమ్మవారిని పూజించిన పూలు అంటే ఎవరైనా కొంటారు. ఆ వచ్చిన సొమ్ముతో అమ్మవారికి నైవేద్యం పెట్టచ్చు..’ అంది.
‘వంగిపోయి ఇక్కడే నడవలేకుండా ఉన్నావు. అంతదూరం వాటిని మోసుకుని ఎలా వెళ్లగలవు. ఆలోచన బాగుంది. కానీ నేను వెళ్తాలే’ అన్నాడు. ‘అసలే అంతగా కళ్లు కనపడవు. మీరెలా వెళతారు.. ఎక్కడైనా పడిపోయారంటే అమ్మవారికి ఈ సేవ కూడా చేసుకోలేము. ఏదో ఈ మాత్రం సేవ చేసుకోగలుగుతున్నామంటే ఇంకా తిరగగలుగుతున్నాము కాబట్టి..’ అని మాట్లాడుకుంటూ మంచినీళ్లు తాగి కడుపు నింపుకుని విశ్రాంతి కోసమని నడుం వాల్చారు.
ఇదంతా విన్న దొంగకి చాలా బాధ కలిగింది. వాళ్ల కోసం ఏదైనా చెయ్యాలనుకున్నాడు.
అలా అనుకున్న వెంటనే వాళ్లకి కనపడకుండా పొదల్లోంచి బయటకి వచ్చాడు. వస్తూనే అక్కడికి దూరంగా అంతకు ముందు రోజు రాత్రి తాను దొంగతనం చేసి తీసుకువచ్చి చెట్టు కింద ఉంచి ఎవరికీ కనపడకుండా చెట్ల కొమ్మలతో మూసివేసిన బియ్యం బస్తాను తీసుకువచ్చి వారికి ఇచ్చాడు. ఇచ్చి.. రెండు చేతులూ జోడించి నమస్కరిస్తూ...
‘మా యజమానికి వ్యాపారంలో బాగా లాభం వచ్చింది. ఇవి మీకు ఇవ్వమన్నారు. ఇక నుంచీ ప్రతీ వారం ఇలా ఒక బస్తా బియ్యం అమ్మవారికి కానుకగా పంపిస్తామన్నారు’ అన్నాడు వినయంగా.
‘నువ్వూ, నీ యజమానీ చల్లగా ఉండాలి నాయనా..! వారంవారం మీరిచ్చే ఆ బియ్యంతో అమ్మవారికి మంచి నైవేద్యం పెట్టడమే కాదు, భక్తులకూ దండిగా ప్రసాదం పంచవచ్చు.. అంతా అమ్మవారి దయ’ అన్నాడు రామశర్మ దొంగకు నమస్కరిస్తూ.
దొంగ ఎంతో సంతోషించి వారం వారం వారికి బియ్యం అందజేస్తూ ఆ ముగ్గురి సేవలో తరించాడు.

-కనె్నగంటి అనసూయ