Others

బృందావన విహారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తీక శుద్ధ ఏకాదశి మొదలుకొని పౌర్ణమి వరకు పంచ పర్వాలలోని ఐదు రోజులలో తులసికి కృష్ణునితో వివాహం జరపడం సనాతర ఆచారం. హిందూ మత విధుల్లో తులసికి అత్యంత ప్రాధాన్యత ఉంది. దేవతార్చనకు తులసి పత్రి ముఖ్యం. తులసి లక్ష్మీదేవి అవతారమని భారతీయుల విశ్వాసం. కాలనేమి కూతురు, జలంధరుని భార్యయైన వృంద (వృంద, బృంద, వృందావనం, బృందావనం సంబంధం) చితాభస్మం నుండి తులసి, ఉసిరి మున్నగునవి పుట్టినట్లు శివపురాణంలో ఉంది. తులసి తీర్థాన్ని మరణ సమయంలో నోటిలో పోయడం, శవ దహన సమయాన తులసి కాష్టాన్ని కొద్దిగైనా వేయడం ఆచరిస్తారు. బృందావనం ఉన్న ఇంటికి యమదూతలు కూడా రారని శాస్త్ర వచనాలు. క్షీరాబ్ది పర్వ సమయంలో తులసి ఒక దేవతగా వ్యవహరింప బడుతున్నది. దేవ దీపావళి పేరున మహారాష్టల్రో కార్తీక శుక్ల ద్వాదశినాడు తులసి వివాహ పర్వం జరుపుతారు. మాళవీయులు ఈ పండువనాడు తులసికోటను శుభ్ర పరిచి వెల్లవేసి, అలంకరించి, సాయంకాల మునిమాపు వేళ మంత్రయుక్తంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాలలో తులసి పూజతో పాటు, పెద్ద ఉసిరి కొమ్మను ఉంచడం, దీపారాధన చేయడం అనవాయితీ. స్మృతి కౌస్త్భుంలో ఏకాదశి మొదలు ఐదు దినాలలో ఏనాడైనా చేయవచ్చునని స్పష్టమవుతున్నది. విష్ణువు అవతారాలలో ఎనిమిదవది కృష్ణావతారం. కృష్ణునితో తులసికి ప్రధానంగా కార్తీక పూర్వార్ధ పక్ష పంచ పర్వాలలో సాయంత్రం గోధూళి వేళ కల్యాణం నిర్వహించడం సాంప్రదాయంగా ఉంది. కృష్ణునితో తులసికి అయ్యే వివాహం వివాహ రుతువును స్వాగతిస్తుంది. వివాహాలకు మాఘాది పంచకాలు తగినవి. తులసి వివాహ పర్వం కార్తీకంలో వస్తుంది. అంటే వివాహ రుతువుకు తులసి కృష్ణుల కళ్యాణం పురోగామి అన్నమాట. శ్రీకృష్ణ విగ్రహానికి, తులసికి చెట్టు వధువుగా, శ్రీకృష్ణ విగ్రహం వరునిగా నిర్దేశించి, మధ్య అంతర పటంగా ఒక శాలువా పట్టుకుంటారు. తులసి వేళ్ళ వద్ద ఒక చెరుకు ముక్క ఉంచి, పసుపు అద్దిన గుడ్డలు, గాజులు మొదలైన ఆభరణాలను తులసి మొక్కకు కట్టి, గణపతి, శివుడు, విష్ణువులను, పుణ్య నదులను స్తోత్రం చేస్తూ, పురోహితుడు మంగళాష్టకాలు చదువుతూ వేదోక్త రీతిలో తంతు నిర్వహించాక తెర ఎత్తి, వివాహం జరిపించడం, నివేదన పదార్థాలను ప్రసాదంగా పంచడం సనాతన సాంప్రదాయాచారం. ఈకార్యక్రమంలో తులసి కోటలో పెద్ద ఉసిరిక కొమ్మను ఒకదానిని ఉంచడం ప్రత్యేకం. తులసితో కలిపి ఉసిరిక కొమ్మను పూజించడం, కాయలలో పూజా సమయాన దీపారాధన చేయడం ఆచారం.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494