Others

వెయటే మినిట్ ( అలనాటి విచిత్రాలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా ప్రపంచంలో మొదటి మాటల సినిమా మీకు తెలుసా? అంతెందుకు ఫస్ట్ డైలాగ్ తెలుసా? ఇప్పటి తీరున చూస్తే.. బహుశ అదే ఫస్ట్ పంచ్ డైలాగ్ కూడా అయవుండొచ్చు. అదేంటో తెలుసుకోవాలన్న ఉత్సుకత కలుగుతోంది కదూ.. అయతే చదవండి.

మనకైతే -ఇప్పుడు బోలెడన్ని సినిమాలు. వద్దన్నా మనల్ని పలకరిస్తూనే ఉంటాయి. సినిమాలోని పాత్రలన్నీ పంచుల్తో పోటీ పడుతుంటాయి. అయితే మన సినిమా ప్రపంచంలో విడుదలైన -మొదటి మాటల సినిమా మీకు తెలుసా? ప్రపంచంలో మొట్టమొదటి టాకీ ఫీచర్ ఫిల్మ్ -జాజ్ సింగర్. వార్నర్ బ్రదర్స్ సంస్థ మొదలుపెట్టిన ఈ సినిమాలో మొదట పాటలు, సంగీతం మాత్రమే ఉండాలనుకున్నారు. ఆ ఆలోచనతోనే షూటింగ్ మొదలెట్టారు. కాని షూటింగ్ సమయంలో ఆల్ జాల్సన్ అనే నటుడు తన మొదటి పాట పాడిన తర్వాత -‘హేయ్, వెయిటె మినిట్. వెయిటె మినిట్. యు హావ్‌న్ట్... ఐ టెల్ యూ.. యూ హావ్‌న్ట్. హెర్డ్ నథింగ్ డర్టీ హ్యాండ్స్. డర్టీ ఫేస్.. అంటూ ఏదో చెప్పబోయాడు. అర్ధంలేకుండా హీరో ఇలా మాట్లాడ్డమేంటని దర్శకుడు అలాస్ ఖ్రాస్ లాండ్ భావిస్తుంటే.. -చిత్ర సహ నిర్మాత టెర్రిక్ ఎఫ్ జాన్సన్ మాత్రం ‘అది చాలా బాగుంది’ అని పట్టుబట్టి చిత్రాన్ని అలాగే విడుదల చేశారు. సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇంతకీ ఆ సినిమాలో ఉన్నవి కేవలం 354 పదాలు. వాటిలో 340 పదాలను హీరో ఆల్ జాల్సనే పలికాడు. 13 పదాలను హీరో తల్లి పాత్రధారిణి యూజీన్ బెసరర్ పలికితే, హీరో తండ్రి పాత్రధారి వార్నర్ ఓలండ్ పలికిన పద ఒకే ఒకటి -‘స్టాప్’ అని. ఆనాటి కాలం నుంచీ హీరో తండ్రికి పెద్దగా మాటల్లేవన్న మాట.
పాత కొత్త తరాలకు మధ్య సంఘర్షణ ఇందులోని ఇతివృత్తం. మత సంబంధమైన గీతాలుపాడే యూదుల ప్రార్థనా మందిరం (సినగాగ్)లోని యూదు గాయకుడు తన కొడుకు వృత్తిపరంగా తన వారసుడు కావాలని కోరుకుంటాడు. కాని అతని ఆశయానికి భిన్నంగా కొడుకు ‘జాజ్ సింగర్’ అవుతాడు. కొడుకు జాకీరాబి నోవిట్జ్‌గా ఆల్ జాల్సన్ నటించాడు. ఇదీ ప్రపంచంలోనే సినిమా ఫస్ట్ డైలాగ్.

-కె శ్రీనివాసరావు