Others

సత్యం శివం సుందరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృస్థిల (సృష్టి స్థితి లయ) 2వ భాగం
- సాంధ్య శ్రీ 8106897404
*
4.
నన్ను నేను విభజించుకున్నాను
ద్విధాగా
బహుధాగా
స్ర్తికారం ధరించిన అశయని
నూతన ద్వారాలు తెరుచుకొని బాధాను పూర్వక సంతోషం
జయించి - ఇదిగో- ఇలా.. నన్ను నేను విభజించుకున్నాను
ఈ భూమండల మార్గాల్లో
ఒంటరిగా నడవలేని బ్రతుకు వేయి విధాలు
అపూర్వ సంపద లాంటి క్షణాన్ని
అవకాశం చేసి అందరకు ఇచ్చాను
సూర్యుడ్ని పులుముకుని కలలు కనటానికి
నక్షత్రాలను చల్లుకుంటూ
ద్రాక్షరసం లాంటి రాత్రిళ్లను తెచ్చాను
‘‘పదములు గదలుచో మొదలింటి చదువుల
పదముల క్రమములు ప్రిదులు కొనగ
గొంతులు విప్పుచోగొసరి గాంధర్వంబు
లు పవేదముల ఘోష యుబ్బటిల్లగ
నేత్ర మొక త్రిప్పుచో నిండు వెనె్నల పిండు
నీరెండ కాకలు నెనరు కొనగ
అవయవ చాల నాభ్యాస యోగంబున
సకలార్థ శాస్తమ్రుల్ సందడింప
ఊపుకోపుల వలయాకృతోర్లుట్లు
సర్గలయ సంస్థితుల భావ సమితి దోప
సృష్టి యంతయు నేనె జీవ వెలగ
తాండవం బాడి...
బాధను నాపుకున్న గుండెనై ప్రవహిస్తాను
కడలి గర్భానికి చేరి ఆవిరినై
ఆకాశపు పొదుగును ఆవిష్కరిస్తాను
నా శరీర భూరిజం ఆకాశ ధారకై
అఱ్ఱులు జాస్తోంది..
జలతారుగా మిసమిస లాడే వాన చినుకు
నా ఊహల పొడి మన్నులోకి జారినపుడు
నే నింతా ఓ గింజనే
ఆత్మ విప్పుకున్న అడవినై పూవునై పండునై
మనిషి గుండెలోకి ప్రవేశిస్తాను
గిరి శిఖరాల మీద దేవదారువునై
దినం మోసం చేయని సూర్య జ్వాలని గండూషిస్తాను.
కావి సంజను మెదిపి - కౌముది
నిశ్శబ్ద మథుర గీతాన్ని వెలిగిస్తాను..
చిగురు నీడలో సౌందర్య స్వప్నాన్ని అల్లుకుంటూ
సేద తీరుతూ పక్షి
నీలి గగనంలోని మబ్బు చుబుకాన్ని
ముక్కుతో పొడుస్తోంది
నా ఆలోచనగాగ్ని లో అడవి అంటుకుంది
రంగుల దండయాత్రలో రేగిన
నవ్య హవ్య సురభిళధూమం..
పరిసరాల స్మృతులు అల్లిన ప్రాపంచిక స్పృహగా
రంగుల్లో పొర్లుతూ
భాషల పుప్పొడిలో భాష్యాలువివరిస్తోంది
లిపి లేని భాష చూపులో చిక్కుకుంది...

- ఇంకావుంది...