Others

ముక్కోటి ‘దీప’మేళా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తీక ‘పౌర్ణమి’ మహోత్సవాన..
దివ్యకాంతులు మిన్నంటేను
ఆనంద పారవశ్యాలు ‘ఎద’ నిండేను

కోటి దీపారాధనతో..
కోవెలలో ‘నవ్య’ కిరణాలు విరిసేను

పవిత్ర పూజలతో..
మోముల్లో ‘శాంతి’ క్రాంతులు కురిసేను

ఈ శుభ తరుణాన..
నింగి ‘తారక’లు ఇల వాలిన చందంగా
పండు ‘వెనె్నల’ వరించిన వైనంగా
పుడమి పులకరించు
భక్త హృదయాలు హర్షించు

భక్తిశ్రద్ధల పూజలు
నోములు, వ్రతాలు, కార్యాలు
అభిషేకాలు ధూప, నైవేద్యాలతో
దేవాలయాల్లో ‘్భక్త జన’ సందడి

పచ్చ తోరణాలు
పసుపు కుంకుమల ద్వారాలు
ఉపవాస దీక్షలు, ఆరాధనతో
ముంగిళ్ళలో ‘సంబరాల’ సవ్వడి

కోటి దీప ‘దానం’తో
సకల ‘సంపద’ల సంప్రాప్తి
జన్మజన్మల ‘పాప’ పరిసమాప్తి
ఈ ‘దివ్వె’ కాంతుల
చెడును చెరిపి..
మంచిని పెంపొందించు
అజ్ఞాన ‘తిమిరాల’ను పారద్రోలి..
విజ్ఞాన ‘వరాల’ ప్రసాదించు

ఈ శుభ ‘మంగళ’ వేళా..
సకల జనావళి సుఖసంతోషాలు
శాంతి సౌభాగ్యాలతో..
విలసిల్లాలని తలచి..
శివకేశవులను భక్తితో కొలిచి..

కార్తీక ‘పౌర్ణమి’ పర్వదినం
అంగరంగ ‘వైభవం’గా జరుపుదాం

సంస్కృతి సాంప్రదాయ ప్రశస్త్యాల
ప్రపంచానికి ‘సగర్వం’గా చాటుదాం

-కోడిగూటి తిరుపతి 95739 29493