Others

అజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంత దూరం నడిస్తేనేం?
నడిచిన చోటే వుండిపోతాం
పోతూ పోతూ పోయనోళ్లంతా చెప్పిన పాఠాలు
నెమరేసుకున్నట్టే వుంటుంది కాని
మనదాకా వస్తేనే కాని ఏదీ అర్థం కాదు
కవిత్వమైనా, జీవితమైనా,
కాలమైనా, చివరికి ముగింపైనా
శూన్యాన్ని కప్పుకున్న వాళ్లంతా
క్షణం నిద్రపోని మేధోజీవులై పోయనట్టు
ఒక్కోసారి పశులకాపరి వినిపిస్తున్న పాట కూడా
వౌనంతో పోరాడుతున్న యోధునిలా అనిపిస్తుంది
నడకంటే నేలతో దోస్తీ
బస్తీలగుండా నడిచినప్పుడు కాని తెలిసిరాదు
జీవితంలో మంచుమైదానాల్లాగే
ఎగుడు దిగుడు దిబ్బలూ
గుడిసెల్లోనో, డేరాల్లోనో రోజులీడ్చే బతుకులుంటాయని
నడిస్తేనే కాని అర్థం కాని మనిషి పాదాల ముంగిట్లో
తలెత్తుకుని ఆ రోజుటి శ్వాస కోసం చేతులు చాచే
ముష్టి బతుకుల్లో ఆశల చివుర్లేసిన మొక్కలు
ఎంత దూరమైనా నడవండి ఆరోగ్యం కోసం
కొంతైనా రాత్రంతా
మంచు బిందువులై కురిసిన కన్నీళ్లని
అరికాళ్లతో తొక్కేస్తూ అడుగులేయడం కంటే
దోసిట్లో నింపుకొని గుండెచేనులో చల్లుకుంటే
మనిషిలో మంచితనానికి ఎరువుగా మారుతుంది
మనసులోంచి తలెత్తిన ప్రతి జెండా అజెండాగా మారి
సాటి మనిషి కోసం
సౌజన్యంతో రెపరెపలాడుతుంది!

- ఈతకోట సుబ్బారావు, 9440529785