Others

అభ్యుదయానికి ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వసంతం వాడిపోయందని
మల్లెలు మాడిపోయాయని
జిల్లేడు డొంకల మధ్య
పిచ్చి కోయలలు విషాద గీతాలు పాడుతున్నాయని
నాకు బాధ లేదు... భయం లేదు
మళ్లీ వసంతం వస్తుందని
మరుమల్లెలు విరుస్తాయని
కొత్త కోయలలు మెత్తగా పాడతాయని
నాకు ధైర్యం.. నాకు నమ్మకం
అందమైన చంద్రుడ్ని మబ్బులు మింగేసినా
నిప్పులు చెరిగే సూర్యుడ్ని
మబ్బులు కమ్మేసినా
అది క్షణికం
మబ్బులను చీల్చి చెండాడుతూ
సూర్యుడు, చంద్రుడు ఉదయస్తూనే ఉంటారు
కానీ.. పెచ్చరిల్లుతున్న
ప్రేమోన్మాదాలు... అఘాయత్యాలు.. హత్యలు.. ఉగ్రవాదాలు, అవినీతి..
వీటిగురించే బాధంతా.
మబ్బు తెరలు తొలగినట్టు
కనుల పొరలు కరిగి
ప్రతి మనిషి సూర్యుడిలా వెలగాలి
చంద్రుడిలా వెనె్నల పంచాలి
అప్పుడే అభ్యుదయం సాకారం

- కామిడి సతీష్‌రెడ్డి, 9848445134