Others

నాకు నచ్చిన పాట-- నన్ను దోచుకుందువటె..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీ రామారావు, జమున నటించిన నన్నుదోచుకుందువటె/ వనె్నల దొరసాని -అన్న పాట అంటే నాకెంతో ఇష్టమైనది. గులేబకావళి కథ చిత్రంలో పాటలన్నీ అద్భుతమైనవే. ఏ పాటను తక్కువ చేయలేం. కానీ సాహితీ సుగంధాలను వెదజల్లిన ఈ పాటను ఇప్పటికీ ప్రేక్షకులు, శ్రోతలు అభిమానిస్తున్నారు. మళ్లీమళ్లీ వింటున్నారు. కన్నులలో దాచుకుందు నినే్న నా స్వామి అని ఆమె బదులివ్వడంతో ఈ పాట సాగుతుంది. -ఎంతటి నెరజాణవో/ నా అంతరంగమందు నిలచి/ కలకాలం వీడని సంకెలలు వేసినావే -అని ఆనంద పరవశంతో కథానాయకుడు పాడతాడు. సముద్రాల వారి తర్వాత అంతగా ఆకట్టుకునేలా సినారె ఈ పాటను రాశారు. ఇగిరిపోని గంధం అని ప్రేమను ఉపమానంలో చెప్పడం కవి గొప్పదనానికి నిదర్శనం. అందుకు తగ్గట్టుగా ఘంటసాల ఆ పలుకుబడిని పలికిన తీరు ఇప్పటికీ చెవులలో వినిపిస్తుంది. ‘నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై వెలసినావు నాలో, నే కలసిపోదు నీలో’ అని నాయిక అంటే ప్రపంచాన్ని జయించినంత ఆనందాన్ని నాయకుడు వ్యక్తం చేస్తాడు. అమలిన శృంగార భావానికి ఈ పాట నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. పాట చిత్రీకరణ కూడా అంతే సౌమ్యంగా సాగి హృదయంలో సుస్థిర స్థానం సంపాదించుకుంటుంది. ఇలాంటి పాటలు ఈ కాలంలో వినగలమా?

-కాకుటూరి సుబ్రహ్మణ్యం, చెన్నయ్